Share News

అనంతలో బీభత్సం...

ABN , Publish Date - May 14 , 2024 | 03:53 AM

అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వీరంగం సృష్టించారు.

అనంతలో బీభత్సం...

అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వీరంగం సృష్టించారు. తాడిపత్రి ఓంశాంతి నగర్‌ పోలింగ్‌ కేంద్రం వద్ద పెద్దారెడ్డి కుమారుడు హర్షవర్ధన్‌రెడ్డి ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారన్న సమాచారంతో జేసీ అశ్మిత్‌రెడ్డి తన అనుచరులతో వెళ్లారు. రెండు పార్టీల శ్రేణులు రాళ్లు రువ్వుకున్నాయి. పలువురు టీడీపీ కార్యకర్తలు, భద్రతా విధుల్లో ఉన్న బీఎ్‌సఎఫ్‌ కానిస్టేబుల్‌, ఓటు వేసేందుకు వచ్చిన నలుగురు వృద్ధులు గాయపడ్డారు. అశ్మిత్‌రెడ్డి కారు అద్దాలు ధ్వంసం చేశారు. డీఐజీ షేముషి బాజపాయి, అడిషనల్‌ ఎస్పీ రామకృష్ణ ఘటనా స్థలానికి చేరుకొని ఇరువర్గాలను చెదరగొట్టారు. తాడిపత్రిలోని పాతకోట, వైఎ్‌సఆర్‌ కమ్యూనిటీ హాల్‌ పోలింగ్‌ కేంద్రాల్లో టీడీపీ ఏజెంట్లు అసిఫ్‌, బాషాపై పెద్దారెడ్డి అనుచరులు దాడిచేశారు. రాప్తాడు వైసీపీ అభ్యర్థి తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి వదిన నయనతారెడ్డి తన అనుచరులతో సిండికేట్‌ నగర్‌లోని పోలింగ్‌ కేంద్రంలోకి వెళుతుండగా టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. దీంతో రెచ్చిపోయిన ఎమ్మెల్యే అనుచరులు.. టీడీపీ నాయకులపై రాళ్లతో దాడి చేశారు.

Updated Date - May 14 , 2024 | 03:53 AM