Share News

ఎమ్మెల్సీ జంగాపై అనర్హత వేటు

ABN , Publish Date - May 17 , 2024 | 03:37 AM

శాసనమండలి సభ్యుడు జంగా కృష్ణమూర్తిపై చైర్మన్‌ కొయ్యే మోషేన్‌రాజు గురువారం అనర్హత వేటు వేశారు. ఈ మేరకు గెజిట్‌ను జారీచేశారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా వైసీపీ తరఫున

ఎమ్మెల్సీ జంగాపై అనర్హత వేటు

అమరావతి, మే 16(ఆంధ్రజ్యోతి): శాసనమండలి సభ్యుడు జంగా కృష్ణమూర్తిపై చైర్మన్‌ కొయ్యే మోషేన్‌రాజు గురువారం అనర్హత వేటు వేశారు. ఈ మేరకు గెజిట్‌ను జారీచేశారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా వైసీపీ తరఫున జంగా కృష్ణమూర్తి శాసనమండలి సభ్యునిగా ఎన్నికయ్యారు. ఇటీవల ఆయన వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. వైసీపీ చేసిన విజ్ఞప్తి మేరకు మండలి చైర్మన్‌ గురువారం నిర్ణయం తీసుకున్నారు.

Updated Date - May 17 , 2024 | 08:00 AM