వ్యాధులు విజృంభిస్తాయ్ జాగ్రత్త..!
ABN , Publish Date - Sep 05 , 2024 | 04:16 AM
: వర ద ప్రభావిత ప్రాంతాలు ఇప్పుడు డేంజర్ జోన్‌లో ఉన్నాయి. వరద తగ్గిన తర్వాత వచ్చే సంక్రమిత వ్యాధుల వల్ల ఎక్కువ ప్రమాదం జరిగే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అమరావతి, సెప్టెంబరు 4(ఆంధ్రజ్యోతి): వర ద ప్రభావిత ప్రాంతాలు ఇప్పుడు డేంజర్ జోన్‌లో ఉన్నాయి. వరద తగ్గిన తర్వాత వచ్చే సంక్రమిత వ్యాధుల వల్ల ఎక్కువ ప్రమాదం జరిగే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీన్ని నివారించాలంటే ప్రజలు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. నాలుగైదు రోజుల పాటు శరీరానికి సరిపడా నీరు, సరైన ఆహారం లేకపోవడం వల్ల డీహ్రైడేషన్‌కు గురయ్యే అవకా శం ఉంది. బాగా నీరసంగా ఉండడం, ఎండలోకి వెళ్తే కళ్లు తిరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి లక్షణాలు కనిపించినా భయపడాల్సిన అవసరం లేదని, ప్రతి ఒక్కరూ కాచిచల్లార్చిన నీరు తాగాలని వైద్యులు సూచించారు. రోజుకి విడతలవారీగా 4 నుంచి 5 లీటర్ల వరకూ నీరు తీసుకోవాలన్నారు. మరోవైపు ఇంట్లో వండుకున్న ఆహారాన్ని వేడిగా ఉన్నప్పుడే తినేయాలని, చెప్పారు. నిల్వ ఉన్న ఆహారం తీసుకుంటే మరిన్ని వ్యాధులు సంక్రమిస్తాయని హెచ్చరించారు.
పరిశుభ్రత ముఖ్యం..
వరద నీరు తగ్గినప్పటికీ ఇంటి బయట గుంత లు, ఇతర ప్రదేశాల్లో నిల్వ నీరు ఉంచకుండా చూసుకోవాలి. ఇళ్లంతా శుభ్రం చేసుకోవాలి. నీటి నిల్వలు ఉంటే వాటిల్లో దోమలు, ఈగలు చేరి వ్యాధులు మరింతగా పెరుగుతాయి. ఇంటి మొ త్తాన్ని క్లోరినేషన్ చేసుకోవాలి. ఇంటి చుట్టు పక్క ల బ్లీచింగ్ చేస్తే చాలా వరకూ వ్యాధుల బారిన పడకుండా కాపాడుకోవచ్చు. లేదంటే దోమల వ ల్ల సంక్రమించే మలేరియా, డెంగీ వంటి రోగాలు ప్రబలుతాయి. ఇళ్ల ముందున్న డ్రైనేజీని కూడా వెంటనే శుభ్రం చేసుకోవాలి. ప్రభుత్వం క్లీనింగ్ కార్యక్రమాలు చేపట్టినా ఎవరికి వారు స్వయంగా ఇళ్ల వద్ద పరిశుభ్రంగా ఉండేలా చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా సెప్టిక్ ట్యాంక్‌లు మొత్తం నిండిపోయి ఉంటాయని, ఇవి అత్యంత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. వీలైనంత త్వరగా వాటిని క్లీన్ చేయించుకోవాలని చెబుతున్నారు.