Share News

అచ్చెన్నాయుడుతో టీడీపీ నేతల చర్చలు

ABN , Publish Date - Feb 07 , 2024 | 11:18 PM

టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుతో బుధవారం విజయవాడ పార్టీ కార్యాలయంలో రైల్వేకోడూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ కస్తూరి విశ్వనాథనాయుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త మాచినేని విశ్వేశ్వరనాయుడు, ప్రముఖ న్యాయవాది కేజేపీ రెడ్డయ్యనాయుడులు రైల్వేకోడూరు రాజకీయంపై చర్చించారు.

అచ్చెన్నాయుడుతో టీడీపీ నేతల చర్చలు
అచ్చెన్నాయుడికి పుష్పగుచ్ఛం ఇస్తున్న విశ్వనాథనాయుడు, తదితరులు

రైల్వేకోడూరు, ఫిబ్రవరి 7: టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుతో బుధవారం విజయవాడ పార్టీ కార్యాలయంలో రైల్వేకోడూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ కస్తూరి విశ్వనాథనాయుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త మాచినేని విశ్వేశ్వరనాయుడు, ప్రముఖ న్యాయవాది కేజేపీ రెడ్డయ్యనాయుడులు రైల్వేకోడూరు రాజకీయంపై చర్చించారు. ఈ సందర్భంగా కస్తూరి మాట్లాడుతూ నియోజకవర్గంలో టీడీపీ బలోపేతమైందని, అభ్యర్థి విజయానికి ఢోకా లేదని పార్టీ అధిష్టానానికి వివరించామని తెలిపారు. రైల్వేకోడూరు, పెనగలూరు, పుల్లంపేట, చిట్వేలి, ఓబులవారిపల్లె మండలాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు ముమ్మరంగా తిరుగుతూ వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలను, టీడీపీ హామీలను ప్రజలకు వివరిస్తున్నామని తెలిపారు. అచ్చెన్నాయుడుతో కోడూరు రాజకీయాలపై సుధీర్ఘంగా చర్చలు నిర్వహించినట్లు వారు తెలిపారు.

Updated Date - Feb 07 , 2024 | 11:18 PM