Share News

ఆ ముగ్గురు ఎస్పీలపై క్రమశిక్షణ చర్యలు

ABN , Publish Date - May 20 , 2024 | 04:27 AM

రాష్ట్రంలో పోలింగ్‌ నాడు, ఆ తర్వాత చెలరేగిన హింసను అరికట్టని కారణంగా సస్పెండైన పల్నాడు, తిరుపతి ఎస్సీలు బిందుమాధవ్‌, అమిత్‌ బర్దార్‌, తిరుపతి జిల్లా నుంచి బదిలీ అయిన ఎస్పీ కృష్ణకాంత్‌ పటేల్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఆ ముగ్గురు ఎస్పీలపై క్రమశిక్షణ చర్యలు

అభియోగాల నమోదుకు సీఎస్‌ ఆదేశాలు

అమరావతి, మే 19 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పోలింగ్‌ నాడు, ఆ తర్వాత చెలరేగిన హింసను అరికట్టని కారణంగా సస్పెండైన పల్నాడు, తిరుపతి ఎస్సీలు బిందుమాధవ్‌, అమిత్‌ బర్దార్‌, తిరుపతి జిల్లా నుంచి బదిలీ అయిన ఎస్పీ కృష్ణకాంత్‌ పటేల్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సీఎస్‌ జవహర్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. గుంటూరు రేంజ్‌ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి పల్నాడులో విధ్వంసంపై ఇచ్చిన నివేదిక.. తిరుపతిలో టీడీపీ అభ్యర్థిపై వైసీపీ గూండాల హత్యాయత్నం.. తాడిపత్రిలో పోలీసుల వైఫల్యం, ఎస్పీపై రాళ్లు రువ్వే పరిస్థితిపై అనంతపురం రేంజ్‌ డీఐజీ శేముషి ఇచ్చిన నివేదిక మేరకు ముగ్గురు ఎస్పీలపై అభియోగాలు నమోదు చేయాలని పేర్కొంటూ జీవో ఇచ్చారు. ఆ ఎస్పీలు తమ వివరణ ఇచ్చేందుకు 15 రోజులు గడువిచ్చారు. 60 రోజుల్లోపు వారిపై చర్య తీసుకుని ఎన్నికల సంఘానికి తెలియజేయాల్సి ఉంది.

Updated Date - May 20 , 2024 | 04:27 AM