Share News

హోం ఓటింగ్‌ పై అధికారులకు దిశానిర్దేశం

ABN , Publish Date - Apr 03 , 2024 | 12:55 AM

ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు అతి ముఖ్యమైనదని, వృద్ధ్దులు, విభిన్న ప్రతిభావంతులు భారత ఎన్నికల సంఘం కల్పించిన హోం ఓటింగ్‌ను సద్వినియోగం చేసుకునేలా చర్యలు చేపట్టాలని ఎన్నికల అధికారి, సబ్‌ కలెక్టర్‌ శివనారాయణ శర్మ అన్నారు.

హోం ఓటింగ్‌ పై అధికారులకు దిశానిర్దేశం

ఎన్నికల అధికారి శివనారాయణ శర్మ

ఆదోని, ఏప్రిల్‌ 2: ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు అతి ముఖ్యమైనదని, వృద్ధ్దులు, విభిన్న ప్రతిభావంతులు భారత ఎన్నికల సంఘం కల్పించిన హోం ఓటింగ్‌ను సద్వినియోగం చేసుకునేలా చర్యలు చేపట్టాలని ఎన్నికల అధికారి, సబ్‌ కలెక్టర్‌ శివనారాయణ శర్మ అన్నారు. మంగళవారం సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం ఆవరణలో బీఎల్వోలకు, సెక్టోరల్‌, రూట్‌ ఆఫీసర్లకు హోం ఓటింగ్‌ పై అవగాహన, శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. సబ్‌ కలెక్టర్‌ మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం అధిక అంగవైకల్యం ఉన్న వారికి, 85 ఏళ్లు పైపడ్డ వృద్ధులకు ఇంటి దగ్గర నుంచే ఓటు వేసే హోం ఓటింగ్‌ సౌకర్యాన్ని అందుబాటులో తెచ్చిందన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి ఓటు హక్కు వినియోగించుకోవడం ముఖ్యమని, విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధులు ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ మార్గాలతో పాటు బీఎల్వోల ద్వారా ఓటు వివరాలు తెలసుకుని, తప్పనిసరిగా ఫారం12-డీ సహాయంతో పీబీ మార్కింగ్‌ చేయించుకోవాలని సూచించారు.

ఫారం-12డీ ద్వారా హోం ఓటింగ్‌...

ఎన్నికలు జరిగే మే 13వ తేదీని దృష్టిలో ఉంచుకొని హోం ఓటింగ్‌కు ఆసక్తి ఉన్న వారి నుంచి ఏప్రిల్‌ 18 నుంచి ఏప్రిల్‌ 23 వరకు ధరఖాస్తులను వారి నుండి ఫారం-12డీ సేకరించి దాని ఆధారంగా పోస్టల్‌ బ్యాలెట్‌ మాదిరిగా హోం ఓటింగ్‌ అవకాశాన్ని కల్పించాలన్నారు. హోం ఓటింగ్‌ విధానం ఇప్పటికే తెలంగాణ, కర్ణాటక, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌ఘడ్‌తో పాటు పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు వర్తింప చేశారన్నారు. త్వరలో జరిగే పార్లమెంట్‌, అసెంబ్లీ ఎన్నికల్లోనూ హోం ఓటింగ్‌ విధానాన్ని అమలు చేస్తుండటంతో అధికారులు అందుకోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని సబ్‌ కలెక్టర్‌ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఏవో శేషయ్య, తహసీల్దార్‌ హసీనా సుల్తానా, డీఎల్‌పీవో అధికారి వీరభద్రప్ప, మునిసిపల్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ అనుపమ, డీటీలు రామేశ్వర్‌ రెడ్డి, రుద్రగౌడ్‌, సంబఽంధిత అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Apr 03 , 2024 | 12:55 AM