Share News

అదుపులోనే డయేరియా

ABN , Publish Date - Oct 21 , 2024 | 03:31 AM

వైద్య ఆరోగ్యశాఖ, స్థానిక వైద్య సిబ్బంది పటిష్టమైన చర్యలు తీసుకోవడం వల్ల విజయనగరం జిల్లా గుర్ల లో డయేరియా అదుపులోకి వచ్చిందని ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు తెలిపారు.

అదుపులోనే డయేరియా

వైద్య ఆరోగ్యశాఖ పటిష్ట చర్యల ఫలితం

సీఎంవోకు స్పెషల్‌ సీఎస్‌ కృష్ణబాబు నివేదిక

విజయనగరం జిల్లాకు ఆరోగ్య శాఖ కమిషనర్‌

ప్రస్తుతం 53 మందికి వివిధ ఆస్పత్రుల్లో చికిత్స

డయేరియాతో ఒక్కరు మాత్రమే మృతి: డీహెచ్‌

అమరావతి, అక్టోబరు 20(ఆంధ్రజ్యోతి): వైద్య ఆరోగ్యశాఖ, స్థానిక వైద్య సిబ్బంది పటిష్టమైన చర్యలు తీసుకోవడం వల్ల విజయనగరం జిల్లా గుర్ల లో డయేరియా అదుపులోకి వచ్చిందని ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు తెలిపారు. ఈ మేరకు సీఎం కార్యాలయానికి నివేది క అందజేశారు. ఆ ప్రాంతంలో ప్రజలు బహిరంగ మల విసర్జన చేయడం వల్ల భూగర్భజలం కలుషితమైందని, నీటి సరఫరా పైపులు డైనేజీల గుం డా వెళ్లడం, లీకేజీ వల్ల కూడా తాగునీరు కలుషితమైందని నివేదికలో వివరించారు. ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ ఆదేశాల మేరకు డయేరియా ప్రబలిన వెంటనే డీహెచ్‌ డాక్టర్‌ పద్మావతిని విజయనగరం జిల్లాకు పంపించామని, ఆదివారం ఉదయం ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ను కూడా విజయనగరం జిల్లాకు పంపించామని తెలిపారు. డయేరి యా వ్యాప్తికి కారణాలపై అధ్యయనం చేసి సమగ్ర నివేదికను అందజేయాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. తాగునీటి నమూనాలను ప్రయోగశాలకు పంపించగా, కలుషితమైనట్లు తేలిందని వెల్లడించారు. ఈ నెల 13న అక్కడ తొలి డయేరియా కేసు నమోదవగా 14న 55 కేసులు, 15న 65 కేసులు నమోదయ్యాయన్నారు. శనివారం ఒక్క కేసు మాత్రమే నమోదైందని వివరించారు. కాగా, గుర్లలో డయేరియాతో వాస్తవంగా ఒక్కరు మాత్రమే చనిపోయారని, మిగిలిన ఏడుగురు పలు ఇతర వ్యాధులతో మరణించారని డాక్టర్‌ పద్మావతి స్పెషల్‌ సీఎ్‌సకు నివేదిక అందించారు.

Updated Date - Oct 21 , 2024 | 03:31 AM