Share News

ఏపీ జేఏసీ ఆధ్వర్యంలో నేడు ధర్నాలు

ABN , Publish Date - Feb 20 , 2024 | 05:41 AM

12వ పీఆర్సీలో ఐఆర్‌ 30 శాతం ఇవ్వాలని, దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న వేలాది కోట్ల రూపాయల బకాయిలు చెల్లించాలని మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా

ఏపీ జేఏసీ ఆధ్వర్యంలో నేడు ధర్నాలు

స్కూల్‌ కాంప్లెక్స్‌ సమావేశాలను బాయ్‌కాట్‌ చేయాలని పిలుపు

అమరావతి, ఫిబ్రవరి 19(ఆంధ్రజ్యోతి): 12వ పీఆర్సీలో ఐఆర్‌ 30 శాతం ఇవ్వాలని, దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న వేలాది కోట్ల రూపాయల బకాయిలు చెల్లించాలని మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి జిల్లాలు 15 యూనిట్లలో ఏపీ జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీలు, ధర్నాలు నిర్వహించనున్నారు. ఈ ఆందోళనా కార్యక్రమాలను విజయవంతం చేయాలిన ఏపీజేఏసీ చైర్మన్‌, సెక్రటరీ జనరల్‌ హృదయరాజు పిలుపునిచ్చారు. సోమవారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. అన్ని యాజమాన్యాల్లో కారుణ్య నియామకాలు వెంటనే చేపట్టాలని, ఆర్టీసీ, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలు, పెన్షనర్లకు అడిషనల్‌ క్వాంటమ్‌ ఆఫ్‌ పెన్షన్‌ తదితర 49 డిమాండ్ల సాధనకై చేపట్టిన ధర్నాలను జయప్రదం చేయాలని కోరారు. సోమవారం విజయవాడలోని ఏపీ ఎన్జీవో కార్యాలయంలో ఏపీ జేఏసీ అత్యవసర సమావేశం జరిగినట్లు పేర్కొన్నారు. ఫిబ్రవరి 19, 20వ తేదీల్లో స్కూల్‌ కాంప్లెక్స్‌ సమావేశాలు లేకపోయినా టీచర్లు ఉద్యమంలో పాల్గొనకుండా అటంకం కల్పించాలనే దురుద్దేశంతోనే సమావేశాలు నిర్వహిస్తున్నారన్నారు. ఈ సమావేశాలను బాయ్‌కాట్‌ చేసి సెలవు దరఖాస్తు చేసుకుని జిల్లాల్లో జరిగే ధర్నాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఫిబ్రవరి 21 నుంచి 24 తేదీ వరకు జిల్లా పర్యటనలు చేస్తామని, 27వ తేదీన చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు.

Updated Date - Feb 20 , 2024 | 08:11 AM