Share News

టీడీపీతోనే గిరిజనుల అభివృద్ధి

ABN , Publish Date - Feb 12 , 2024 | 11:58 PM

టీడీపీతోనే గిరిజనుల అభివృద్ధి సాధ్యమని పత్తికొండ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి కేఈ శ్యాంబాబు అన్నారు.

టీడీపీతోనే గిరిజనుల అభివృద్ధి
శ్యాంబాబు సమక్షంలో టీడీపీలో చేరుతున్న అమకతాడు గ్రామస్థులు

గిరిజన గ్రామాల్లో కేఈ శ్యాంబాబు ప్రచారం

టీడీపీలో చేరిన అమకతాడు గ్రామస్థులు

తుగ్గలి, ఫిబ్రవరి 12: టీడీపీతోనే గిరిజనుల అభివృద్ధి సాధ్యమని పత్తికొండ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి కేఈ శ్యాంబాబు అన్నారు. సోమవారం మండల పరిధిలోని లక్ష్మీతండా, జాప్లాతండా, మిద్దెతండా, చిగుర్లగుట్ట తండాలో బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ తిరుగుతూ టీడీపీ మేనిఫెస్టోను వివరించారు. ఈ సందర్భంగా కేఈ మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం ఎస్టీల అభివృద్ధి కోసం ఎస్టీ కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి గిరిజనులకు అన్ని రకాల రుణాలు అందించామని, అలాగే ప్రతి గిరిజన తండాకు బీటీ, సీసీ రోడ్లు వేయడంతో పాటు తాగునీటి సమస్య కూడా పరిష్కరించామని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం గత ఐదేళ్లలో ఎలాంటి అభివృద్ధి చేయలేదని, గిరిజనులను నట్టేట ముంచారని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపకపోతే బడుగు, బలహీనవర్గాల అభివృద్ధి కుంటు పడుతుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు తుగ్గలి నాగేంద్ర, బత్తిన వెంకట్రాముడు, వెంకటస్వామి, చంద్రశేఖర్‌ యాదవ్‌, మీటూ నాయక్‌, జయరాముడు, రాజు నాయక్‌, హనుమంతు నాయక్‌, తిరుపాల్‌ నాయక్‌, రమేష్‌నాయక్‌, రాము నాయక్‌, సేవ్యా నాయక్‌, రూప్లా నాయక్‌, తిరుపాల్‌నాయుడు, శ్రీనివాసులు గౌడు, వెంకట్రాముడు చౌదరి తదితరులు పాల్గొన్నారు.

టీడీపీలో చేరిన అమకతాడు గ్రామస్థులు

పత్తికొండ/క్రిష్ణగిరి, ఫిబ్రవరి 12: పత్తికొండ నియోజకవర్గ పరిధిలోని క్రిష్ణగిరి మండలం అమకతాడు గ్రామానికి చెందిన 80 కుటుంబాలు సోమవారం టీడీపీ ఇన్‌చార్జి కేఈ శ్యాంబాబు ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు. పత్తికొండ టీడీపీ కార్యాలయంలో కేఈ శ్యాంబాబు పార్టీ కండువా వేసి వారిని పార్టీలో ఆహ్వానించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన వాల్మీకి, దూదేకుల వర్గాలకు చెందిన నాయకులు మర్రి శ్రీరాములు, వీరభద్రుడు, గురుస్వామి, ఆంజనేయులు, వెంకటేశ్‌తో పాటు పలువురు నాయకులు మాట్లాడుతూ వైసీపీ పాలనలో తమ గ్రామంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. ప్రశాంతంగా ఉన్న గ్రామంలో వైసీపీ నాయకులు చిచ్చు పెడుతూ గొడవలు సృష్టిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో టీడీపీతోనే అభివృద్ధి సాధ్యమని యువ నాయకుడు శ్యాంబాబు నాయకత్వంలో టీడీపీలో చేరామని ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయం కోసం పని చేస్తామని స్పష్టం చేశారు.

Updated Date - Feb 12 , 2024 | 11:58 PM