రాయచోటి అభివృద్ధి టీడీపీతోనే సాధ్యం
ABN , Publish Date - Mar 13 , 2024 | 11:43 PM
రాయచోటి అభివృద్ధి తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన పట్టణంలోని 9, 11, 12 వార్డుల్లో రెండవ రోజు ఇంటింట ప్రచారం కొనసాగించారు.
మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి
రాయచోటిటౌన్, మార్చి 13: రాయచోటి అభివృద్ధి తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన పట్టణంలోని 9, 11, 12 వార్డుల్లో రెండవ రోజు ఇంటింట ప్రచారం కొనసాగించారు. ఈ సందర్భంగా రాంప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ రాయచోటిలో టీడీపీ గెలుపే లక్ష్యంగా ఇంటింటా ప్రచారం చేస్తూ ముందుకు సాగుతున్నామన్నారు. ఈ సందర్భంగా 9వ వార్డుకు చెందిన మహిళలు మాట్లాడుతూ వీధుల్లో మురికి కాలువలు ఉప్పొంగి రోడ్డుపైకి మురుగునీరు వచ్చి దుర్వాసనకు ప్రజలు రోగాల భారిన పడుతున్నా పట్టించుకోలేదన్నారు. ఈసారి టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వాన్ని గెలిపించుకుంటే మీ సమస్యలన్నీ తీరుతాయ న్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ యువనాయకులు మండిపల్లి రాహుల్‌రెడ్డి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గాజుల ఖాదర్‌బాషా, ప్రముఖ వ్యాపారవేత్త కోడి శ్రీను, బేపారి జాఫర్‌వలి, అల్లాబకాష్, సయ్యద్, నౌషాద్, జగదీశ్, గౌస్ సయ్యద్, యునె్‌సఖాన్ పాల్గొన్నారు.
ముస్లిం మైనార్టీలతో ఆత్మీయ సమావేశం
పట్టణంలోని కొత్తపల్లె ప్రాంతంలో ముస్లిం సోదరులు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో రాంప్రసాద్‌రెడ్డి పాల్గొని మాట్లాడారు. ప్రజలు సరైన రోడ్లు, డ్రైనేజీ కాలువలు, తాగునీరు లేక తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. పేరుకే స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీ అని చెప్పుకుంటూ ఎటువంటి మౌలిక సదుపాయాలు లేని విధంగా రాయచోటిని పాలించారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ నేతలు ఖాదర్‌మోద్దీన్, గీత బీడీ యజమాని నసీబ్‌జాన్, ఖాదర్‌బాషా, సగీర్, అతావుల్లా, హలీమా, బీఎంకే రషీద్, షాహిదా, రహజాన్ బీబీజాన్, కరీమున్నీషా, నజీరున్నీషా, షహనాద్, శిమీరున్నిషా, తాజున్, రషీదాబేగం పాల్గొన్నారు.
లక్కిరెడ్డిపల్లె: వైసీపీ అరాచక పాలనను అంతం చేసి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడును ముఖ్యమంత్రిని చేద్దామని రాయచోటి టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి రాంప్రసాద్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం అనంతపురం గంగమ్మతల్లిని దర్శించుకున్నారు. అమ్మవారి పూజారులు, చెల్లువంశీయులు రాంప్రసాద్‌రెడ్డికి స్వాగతం పలికి అమ్మవారి సన్నిధిలో పూజలు నిర్వహించి దుశ్శాలువాతో సన్మానించారు. అనంతరం యనమలవాండ్లపల్లె, మాజీ ఎంపీటీసీ మదనమోహన్ ఇచ్చిన విందులో పాల్గొని విలేకర్లతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ పాలనపై ప్రజలు విసుగెత్తిపోయారన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.