Share News

లోతుగా విచారణ చేయాలి

ABN , Publish Date - Sep 21 , 2024 | 03:49 AM

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీపై లోతుగా విచారణ జరిపి బాధ్యుల పై కఠిన చర్యలు తీసుకోవాలని చిలుకూరు బాలాజీ దేవాలయం ప్రధాన అర్చకుడు సీఎస్‌ రంగ రాజన్‌ డిమాండ్‌ చేశారు.

లోతుగా విచారణ చేయాలి

బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్న సీఎస్‌ రంగరాజన్‌

సీబీఐ విచారణకు డిమాండ్‌ చేసిన వీహెచ్‌

మొయినాబాద్‌ రూరల్‌, సెప్టెం బరు 20(ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీపై లోతుగా విచారణ జరిపి బాధ్యుల పై కఠిన చర్యలు తీసుకోవాలని చిలుకూరు బాలాజీ దేవాలయం ప్రధాన అర్చకుడు సీఎస్‌ రంగ రాజన్‌ డిమాండ్‌ చేశారు. లడ్డూ ప్రసాదంలో కల్తీ జరగడం ఘోర మని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, మోదీ, అమిత్‌షాలకు నిజంగా దేవుడిపైన భక్తి ఉం టే లడ్డూ కల్తీ వ్యవహారంపై వెంటనే సీబీఐ విచారణకు ఆదేశించాలని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హన్మంతరావు డిమాండ్‌ చేశారు. మూడు నెలల్లో విచారణను ముగించి బాధ్యులను కఠినంగా శిక్షించాలన్నారు. తిరుమల లడ్డూ లో కల్తీ నెయ్యి వినియోగం పరమ దుర్మార్గమని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు బక్కని నర్సింహులు చెప్పారు.

Updated Date - Sep 21 , 2024 | 03:49 AM