Share News

డీకంపోజర్‌తో సేంద్రియ పదార్థం తయారీ

ABN , Publish Date - May 19 , 2024 | 12:54 AM

వరి గడ్డి డీకంపోజర్‌ ద్వారా పంట పొలంలోనే గడ్డిని కుళ్ల బెట్టి సేంద్రీయ పదార్థాన్ని తయారు చేసుకునే విధంగా రైతులకు అవగాహన కల్పించినట్టు మార్టేరు వ్యవసాయ పరిశోధన కేంద్రం ప్రదాన శాస్త్రవేత్త సీహెచ్‌ శ్రీనివాస్‌ అన్నారు.

డీకంపోజర్‌తో సేంద్రియ పదార్థం తయారీ
డీ కంపోజర్‌తో సేంద్రీయ పదార్థాన్ని తయారుచేస్తున్న విద్యార్థులు

  • మార్టేరు వ్యవసాయ పరిశోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త శ్రీనివాస్‌

కొవ్వూరు, మే 18: వరి గడ్డి డీకంపోజర్‌ ద్వారా పంట పొలంలోనే గడ్డిని కుళ్ల బెట్టి సేంద్రీయ పదార్థాన్ని తయారు చేసుకునే విధంగా రైతులకు అవగాహన కల్పించినట్టు మార్టేరు వ్యవసాయ పరిశోధన కేంద్రం ప్రదాన శాస్త్రవేత్త సీహెచ్‌ శ్రీనివాస్‌ అన్నారు. శనివారం మండలంలోని దొమ్మేరులో అచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, వ్యవసాయ కళాశాలల ఆధ్వర్యంలో ఎన్‌ఎస్‌ఎస్‌ కార్యక్రమంలో భాగంగా మట్టి నమూనా సేకరణ, క్షేత్ర సందర్శన, వేస్టు డీకంపోజర్‌ తయారుచేసి తద్వారా పంట కోసిన తరువాత పొలంలో మిగిలివున్న గడ్డిని కాల్చి వేయకుండా కుళ్లబెట్టి సేంద్రియ పదార్థం తయారుచేయడంపై రైతులకు, రాజమహేంద్రవరం వ్యవసాయ కళాశాల విద్యార్థులకు అవగాహన కల్పించారు. శ్రీనివాస్‌ మాట్లాడుతూ డీకంపోజర్‌ ద్వారా పేడ, వ్యవసాయ, కూరగాయల వ్యర్ధాలు, ఎండుకర్రలు, బెరడులను వేగంగా కుళ్లబెట్టవచ్చునన్నారు. దాని నుంచి వచ్చే కంపోస్టు మట్టి ఎరువుగా ఉపయోగించుకోవచ్చునన్నారు. పట్టణ ప్రాంతాల్లో ఉద్యానవనాలు ఉన్నవారు డీకంపోజర్‌ను సరళమైన గార్డెన్‌ ఇన్‌పుట్‌గా ఉపయోగించవచ్చునన్నారు. ఇది నత్రజని, భాస్వరం, పొటాష్‌లను నేల పోషకాలుగా పొందడంలో సహాయపడుతుందన్నారు. కార్యక్రమంలో కేఎం దక్షిణామూర్తి, సీహెచ్‌ సునీత, ప్రొఫెసర్స్‌ ఎస్‌వీ భవానిప్రసాద్‌, టి.ఉషారాణి, డి.శేఖర్‌ పాల్గొన్నారు.

Updated Date - May 19 , 2024 | 12:54 AM