Share News

మీకు ఇష్టమైన భాషను ఎంచుకోండి

దస్తగిరి ఆరోపణలు అవాస్తవం

ABN , Publish Date - Mar 03 , 2024 | 03:10 AM

వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్‌గా ఉన్న దస్తగిరిని తాను కడప జైల్లో కలిసి తమకు అనుకూలంగా మాట్లాడితే రూ.20 కోట్లు ఇస్తామంటూ బేరాలకు దిగినట్లుగా దస్తగిరి చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమని దేవిరెడ్డి శంకర్‌రెడ్డి కుమారుడు దేవిరెడ్డి చైతన్యరెడ్డి తెలిపారు.

దస్తగిరి ఆరోపణలు అవాస్తవం

నా తండ్రికి బెయిల్‌ రాకూడదనే దస్తగిరి డ్రామాలు

మీడియాతో దేవిరెడ్డి శంకర్‌రెడ్డి కుమారుడు చైతన్యరెడ్డి

కడప (మారుతీనగర్‌), మార్చి 2: వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్‌గా ఉన్న దస్తగిరిని తాను కడప జైల్లో కలిసి తమకు అనుకూలంగా మాట్లాడితే రూ.20 కోట్లు ఇస్తామంటూ బేరాలకు దిగినట్లుగా దస్తగిరి చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమని దేవిరెడ్డి శంకర్‌రెడ్డి కుమారుడు దేవిరెడ్డి చైతన్యరెడ్డి తెలిపారు. శనివారం కడపలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కేసు దర్యాప్తులో ఉండగా మీడియా ముందుకు రాకూడదని భావించానని, అయితే దస్తగిరి తమపై లేనిపోని అవాస్తవాలు చెబుతూ తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. గత ఏడాది నవంబరులో కడప జైలులో పది మంది వైద్య అధికారులు, సిబ్బందితో కలిసి మెడికల్‌ క్యాంపు నిర్వహించామని, ఆ సమయంలో దస్తగిరిని తాను బెదిరించినట్లుగా చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. అలా చేసివుంటే ఆరోజే ఎందుకు ఫిర్యాదు చేయలేదో చెప్పాలన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు డైరెక్షన్‌లో దస్తగిరి డ్రామాలాడుతున్నారనే సంగతి అందరికీ అర్థమవుతోందన్నారు. వివేకా హత్యతో ఎంపీ అవినాశ్‌రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్‌రెడ్డి, తన తండ్రి దేవిరెడ్డి శంకర్‌రెడ్డిలకు ఎలాంటి సంబంధం లేదన్నారు. తన తండ్రికి బెయిల్‌ రాకుండా అడ్డుకునే కుట్రలో భాగంగా కట్టుకథలు అల్లుతున్నారని విమర్శించారు. హత్య జరిగిన ఛీతర్వాత తొలుత మీడియా ముందు మాట్లాడింది ప్రస్తుతం బీజేపీలో రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్న మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి అని, దీనిని సునీత ప్రశ్నించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు.

Updated Date - Mar 03 , 2024 | 07:43 AM