Share News

చీకటి వెలుగులు పుస్తకావిష్కరణ

ABN , Publish Date - Feb 25 , 2024 | 11:43 PM

బహుగ్రంథ కర్త, కమల కళానికేతన్‌ సాహితీ సంస్థ అధ్యక్షుడు సవ్వప్ప గారి ఈరన్న రచించిన చీకటి వెలుగులు 69వ పుస్తకాన్ని ఆదివారం ఆలూరు గ్రంథాలయంలో ఆవిష్కరించారు.

చీకటి వెలుగులు పుస్తకావిష్కరణ

చీకటి వెలుగులు పుస్తకావిష్కరణ

ఆలూరు, ఫిబ్రవరి 25: బహుగ్రంథ కర్త, కమల కళానికేతన్‌ సాహితీ సంస్థ అధ్యక్షుడు సవ్వప్ప గారి ఈరన్న రచించిన చీకటి వెలుగులు 69వ పుస్తకాన్ని ఆదివారం ఆలూరు గ్రంథాలయంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి విశ్రాంత తహసీల్దార్‌ షేక్షావలి, విశ్రాంత ఎంఈవో హెచ్‌ రామలింగమ్మ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం పుస్తకాన్ని విశ్రాంత మండల విద్యాధికారి హత్తిబెళగల్‌ రామలింగమ్మకు అంకితం చేశారు. ఈ సందర్భంగా పుస్తక ఆవిష్కరణను కవులు, సాహిత్యవేత్తలు, సోమన్న, ఎస్‌ భాస్కర్‌ సమీక్షించారు. తెలుగు భాష పరిరక్షణ ఆవశ్యకతను గూర్చి వివరాంచారు. అనంతరం పుస్తక రచయిత కవి సవ్వప్ప గారి ఈరన్నను సన్మానించారు. కార్యక్రమంలో గ్రంథాలయాధికారి నీరుగంటి వెంకటేశ్వర్లు, పద్యకవి ఈశ్వరప్ప, కళాకారుడు రంగన్న, నల్లారెడ్డి, యం. జి. భాస్కర్‌ గౌడ్‌, కుమారి సుచేత, వీరాస్వామి, రామ్మూర్తి విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - Feb 25 , 2024 | 11:43 PM