Share News

ప్రమాదకరంగా మ్యాన్‌హోల్స్‌

ABN , Publish Date - May 21 , 2024 | 12:12 AM

ఎమ్మిగనూరు పట్టణంలో యూజీడీ ( అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ )కింద ఏర్పాటు చేసి మ్యాన్‌ హోల్స్‌ ప్రమాదకరంగా మారాయి.

ప్రమాదకరంగా మ్యాన్‌హోల్స్‌
లక్ష్మీపెట సంజీవయ్యనగర్‌ రోడ్డులో పైకప్పు లేకుండా తెరుచుకున్న మ్యాన్‌హోల్‌

ఎమ్మిగనూరు టౌన్‌, మే 20 : ఎమ్మిగనూరు పట్టణంలో యూజీడీ ( అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ )కింద ఏర్పాటు చేసి మ్యాన్‌ హోల్స్‌ ప్రమాదకరంగా మారాయి. దీంతో పట్టణవాసులు నిత ్యం ప్రమాదాల బారినపడుతున్నారు. పదేళ్ల క్రితం పట్టణంలో మురుగునీటి యూజీడీ (అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ) వ్యవస్థను ప్రారంభించారు. అ పఽథకం కాస్త నేటికీ పూర్తి కాలేదు. అయితే యూజీడీ పైపు లైనుతో పాటు పలు ప్రాంతాల్లో మ్యాన్‌ హోల్స్‌ ప్రధాన రహదారులతో పాటు పలు వీధుల్లో మ్యాన్‌ హోల్స్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగానే మ్యాన్‌ హోల్స్‌ పై కప్పులను కూడా బిగించారు. ఎళ్లుగడుస్తున్నా యూజీడీ పూర్తి కాకపోవడంతో నిర్వహణ సైతం సక్ర మంగా లేక మ్యాన్‌ హోల్స్‌ పైకప్పులు అనేక ప్రాంతాల్లో ధ్వంసమయ్యాయి. దీంతో ఎక్కడబడితే అక్కడ మ్యాన్‌ హోల్స్‌ నోళ్లు తెరుచుకున్నాయి. ప్రధానంగా పట్టణంలోని హెచ్‌బీఎస్‌ కాలనీ ఎల్‌ఐసీ కార్యాలయం రోడ్డు, సోగనూరు రోడ్డు, లక్ష్మిపెట సంజీవయ్యనగర్‌ రోడ్డు (పాత శివాలయం), ఈద్గా రోడ్డు, మరి కొన్ని ప్రధాన వీధుల్లోనూ ఇదే పరిస్థితి, వివర్స్‌ కాలనీలో మరి కొన్ని గుంతలమయం అయ్యాయి. ఈ రోడ్లలో నిత్యం జనసంచారం ఉంటుంది. వాహనదారులు, పాదచారులు అధిక సంఖ్యలో రాకపోకలు సాగిస్తుంటారు. మ్యాన్‌హోల్స్‌ పైకప్పులు లేకపోవడంతో ప్రమాదాల బారిన పడుతున్నారు. ప్రధానంగా రాత్రివేళలో అటుగా వచ్చేవారికి మ్యాన్‌హోల్స్‌ పై కప్పులు కనిపించకపోవడంతో వాటిలో పడి కాళ్లు చేతులు విరిగిన ధాఖలాలు ఉన్నాయి.పైగా వర్షాలు మొదలవడంతో వర్షపు నీరు నిల్వ ఉండడం వలన మ్యాన్‌ హోల్స్‌ పైకప్పులు లేనివాటిని గుర్తించడం కష్టం. ఇలాంటి సమయాల్లో ప్రమాదాలు మరింత ఎక్కువగా జరిగే అవకాశం లేకపోలేదు. ప్రజలు ప్రమాదాల బారిన పడుతున్నా మున్సిపల్‌ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తుండడంపై పట్టణ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఎక్కడైతే మ్యాన్‌హోల్స్‌ పైకప్పులు లేని వాటిని గుర్తించి వాటికి పై కప్పులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Updated Date - May 21 , 2024 | 12:12 AM