Share News

బిల్లుల దందా..!

ABN , Publish Date - Oct 21 , 2024 | 12:22 AM

ఇంటింటికి రేషన సరుకులు సరఫరా చేసేందుకు ఏర్పాటు చేసిన ఎండీయూ వాహనాలు గత కొన్ని నెలలుగా సక్రమంగా పని చేయడంలేదు.

బిల్లుల దందా..!

తాడిమర్రి, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి) : ఇంటింటికి రేషన సరుకులు సరఫరా చేసేందుకు ఏర్పాటు చేసిన ఎండీయూ వాహనాలు గత కొన్ని నెలలుగా సక్రమంగా పని చేయడంలేదు. గత ప్రభుత్వ హయాంలో మండలంలో 10,601 రేషన దుకాణాలకు గాను ఆరు లాగినలు క్రియేట్‌ చేశారు. ఆ ఆరు వాహనాలలో బియ్యం పంచేలా చర్యలు చేపట్టారు. దీనికి గాను వైసీపీ ప్రభుత్వం వాహనాలను అందజేసి ఒక్కొదానికి రూ.18 వేలు చొప్పున ప్రతినెలా చెల్లించేది. ఇందులోనే డ్రైవర్‌ వేతనంతో పాటు వాహనం బాడుగ కూడా ఉంటుంది.


మరమ్మతులకు నోచుకోక..

గత ఏడాది డిసెంబరులోనే ఒక వాహనం పూర్తీగా మరమత్తుకు వచ్చి ఎంపీడీఓ కార్యాలయ ఆవరణంలో ఉండిపోయింది. మరో వాహనం కూడా పూర్తీగా దెబ్బతింది. ఇలా ఈ రెండు వాహనాలూ సుమారు పది నెలలుగా మరమ్మతులకు గురై.. నిరుపయోగంగా పడి ఉన్నాయి. ఒక్కో వాహనం విలువ సుమారు రూ. 5.38 లక్షలు. ఇలా ఈ వాహనాలు నిరుపయోగంగా పడివేయడంతో.. అవి తుప్పుపటి నాశనం అవుతున్నాయి.


గ్రామాలకు వెళ్లకున్నా..

రెండు వాహనాలు చెడిపోగా.. ఇక మిగిలినవి నాలుగు వాహనాలు. వీటిలో తాడిమర్రి మండల కేంద్రానికి సంబంధించిన వాహనం మినహా ఏ ఒక్కటీ పనిచేస్తున్న దాఖలాలు లేవు. నారసింపల్లి, పుల్లప్పల్లి, నిడిగల్లు గ్రామా లకు కేటాయించిన వాహనాలు గత ప్రభుత్వ హయాంలోనే నిలిపివేశారు. అయితే నేటికీ ఎండీయూ వాహనాలకు, వాటి డ్రైవర్లకు అధికారులు బిల్లులు చెల్లిస్తుండటం విశేషం. ఈ నాలుగు వాహనాలకూ ఒక్కోదానికి రూ.18 వేలు చొప్పున చెల్లిస్తున్నారు. దీనిపై సీఎస్‌డీటీ శారదమ్మను సెల్‌ఫోన ద్వారా సంప్రదించడానికి యత్నించడగా.. ఆమె స్పందించలేదు.

Updated Date - Oct 21 , 2024 | 12:22 AM