అనంతబాబుపై దళితుల ఆగ్రహం
ABN , Publish Date - Apr 03 , 2024 | 02:59 AM
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం ధర్మవరంలో ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ దళితుల ఆగ్రహానికి గురై పరారవుతున్న వీడియోలు మంగళవారం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.

మోటార్ సైకిల్ ఎక్కి పరార్
సోషల్ మీడియాలో వీడియోలు వైరల్
ప్రత్తిపాడు, ఏప్రిల్ 2: కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం ధర్మవరంలో ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ దళితుల ఆగ్రహానికి గురై పరారవుతున్న వీడియోలు మంగళవారం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ప్రత్తిపాడు వైసీపీ అభ్యర్థి వరుపుల సుబ్బారావుకు సమీప బంధువైన ఉదయభాస్కర్... ధర్మవరం ఎన్నికల ప్రచారంలో దళితుల ఆగ్రహానికి గురైన విషయం తెలిసిందే. సోమవారం రాత్రి జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘దళితుడిని చంపి అంబేడ్కర్ విగ్రహానికి దండ వేయడానికి సిగ్గుందా, ఎస్సీ వాడిని చంపి ఏవిధంగా దండ వేస్తావంటూ దళితులు కేకలు వేస్తూ అనంతబాబును వెంబడించడంతో ఆయన బైక్ ఎక్కి పరారయ్యారు. ఆయన గన్‌మెన్ కూడా బైక్ వెనుక పరిగెత్తారు. అనంతబాబు, వరుపుల, చలమలశెట్టి సునీల్‌ను దళితులు చుట్టుముట్టడంతో అక్కడ నుంచి జారుకున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.