Share News

బాబు కోసం ఖమ్మం నుంచి సైకిల్‌పై...

ABN , Publish Date - Jun 12 , 2024 | 03:05 AM

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ఓ అభిమాని ఖమ్మం నుంచి సైకిల్‌పై తరలివెళ్లాడు.

బాబు కోసం ఖమ్మం నుంచి సైకిల్‌పై...

ఖమ్మం, జూన్‌ 11: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ఓ అభిమాని ఖమ్మం నుంచి సైకిల్‌పై తరలివెళ్లాడు. గన్నవరం విమానాశ్రయం సమీపంలో కేసరపల్లి ఐటీపార్క్‌ వద్ద జరగబోయే చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ఖమ్మంలోని వేణుగోపాల్‌నగర్‌కి చెందిన తెలుగుదేశం కార్యకర్త లక్ష్మణ్‌ టీడీపీపై ఉన్న అభిమానంతో ప్రమాణ స్వీకార ప్రాంతానికి సైకిల్‌పై మంగళవారం బయలుదేరాడు. ఖమ్మం టీడీపీ ఆఫీసు నుంచి ఆయన సైకిల్‌పై బయలుదేరాడు. ఆయన యాత్రను టీడీపీ ఖమ్మం పార్లమెంట్‌ కమిటీ ప్రధాన కార్యదర్శి కేతినేని హరీష్‌ జెండా ఊపి ప్రారంభించారు.

Updated Date - Jun 12 , 2024 | 06:52 AM