Share News

ఆ భూములపై సీఎస్‌

ABN , Publish Date - May 29 , 2024 | 04:03 AM

రాష్ట్రంలోని రాజకీయాలకు కేంద్ర బిందువైన సీఎస్‌ జవహార్‌రెడ్డి తనపై వచ్చిన ఆరోపణలకు వెంటనే సమాధానం చెప్పాలి.

ఆ భూములపై సీఎస్‌

శ్వేతపత్రం విడుదల చేయాలి: పాతూరి

అమరావతి, మే 28(ఆంధ్రజ్యోతి): ‘రాష్ట్రంలోని రాజకీయాలకు కేంద్ర బిందువైన సీఎస్‌ జవహార్‌రెడ్డి తనపై వచ్చిన ఆరోపణలకు వెంటనే సమాధానం చెప్పాలి. శ్వేతపత్రం విడుదల చేయాలి’ అని బీజేపీ నాయకుడు పాతూరి నాగభూషణం డిమాండ్‌ చేశారు. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘రాష్ట్రంలో 250 మందికి పైగా ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులున్నారు. అయినా ఒక్క జవహార్‌రెడ్డిపైనే ఇన్ని ఆరోపణలు వస్తున్నాయంటే ఇదేదో సాధారణ విషయం కాదు. జగన్‌రెడ్డి అసెంబ్లీలో మూడు రాజధానుల ప్రకటన చేసిన తర్వాత వైసీపీ నేతలు విశాఖపట్నంలో పెద్ద ఎత్తున భూ అక్రమాలకు పాల్పడ్డారు. అందులో భాగమే సీఎ్‌సపై వందల ఎకరాల భూ కుంభకోణ ఆరోపణలు. చివరి రోజు వరకూ వీలైనంత చక్కబెట్టుకోవడం, తమ వారిని ఐఏఎ్‌సలుగా చేసుకోవడానికి డీవోపీటీకి లేఖలు రాయడం తప్ప కరువు, ఇతరత్రా ప్రజా సమస్యలపై ధ్యాసే లేదు. రాష్ట్రంలో అధికారులను మార్చడానికి పురందేశ్వరి ఫిర్యాదులే కారణమని చెబుతోన్న వైసీపీ నేతలు... ఆమె మొదట ఫిర్యాదు చేసిన సీఎస్‌ జవహార్‌రెడ్డిని ఎందుకు బదిలీ చేయలేదో చెప్పగలరా? జూన్‌ నాలుగు తర్వాత రాష్ట్రంలో ఏర్పడబోయే ఎన్డీఏ ప్రభుత్వం అక్రమార్కులు ఎవ్వరినీ వదిలిపెట్టదు’ అని పాతూరి హెచ్చరించారు.

Updated Date - May 29 , 2024 | 08:02 AM