Share News

మన్యంలో పర్యాటకుల సందడి

ABN , Publish Date - Oct 21 , 2024 | 04:33 AM

అల్లూరి సీతారామరాజు జిల్లాలో పర్యాటక ప్రాంతాలు ఆదివారం సందర్శకులతో కిటకిటలాడాయి.

మన్యంలో పర్యాటకుల సందడి

కిటకిటలాడిన మేఘాల కొండ

చింతపల్లి(అల్లూరి జిల్లా), అక్టోబరు 20(ఆంధ్రజ్యోతి): అల్లూరి సీతారామరాజు జిల్లాలో పర్యాటక ప్రాంతాలు ఆదివారం సందర్శకులతో కిటకిటలాడాయి. అనంతగిరి మండలంలోని బొర్రా గుహలు, కటికి, తాడిగుడ జలపాతాలు, అరకులోయలోని పద్మాపురం గార్డెన్స్‌, గిరిజన మ్యూజియం, చింతపల్లి మండలంలో లంబసింగి, పాడేరు మండలంలోని వంజంగి మేఘాల కొండ, జి.మాడుగుల మండలం కొత్తపల్లి జలపాతం తదితర ప్రదేశాలకు పర్యాటకులు పోటెత్తారు. పాలసంద్రాన్ని తలపించేలా ఉండే లంబసింగి సమీపంలోని చెరువులవేనం వ్యూపాయింట్‌, వంజంగి హిల్స్‌ వద్ద వేకువజాము నుంచే రద్దీ కనిపించింది. మంచు అందాలను ఆస్వాదిస్తూ పర్యాటకులు ఫొటోలు దిగి సందడి చేశారు.

Updated Date - Oct 21 , 2024 | 04:33 AM