Share News

ఏళ్లతరబడి పాతుకుపోయారు

ABN , Publish Date - Jul 05 , 2024 | 06:20 AM

దేవదాయ శాఖలో జరుగుతున్న అంతర్గత బదిలీలపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఏళ్ల తరబడి కీలక సెక్షన్లలో పాతుకుపోయిన వారికే మళ్లీ కీలక పోస్టింగ్‌లు ఇస్తున్నారని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. గురువారం పదిమంది కీలక ఉద్యోగుల సెక్షన్లు మారుస్తూ దేవదాయ శాఖ అంతర్గత బదిలీలు చేపట్టింది. దేవదాయ శాఖలో అడ్మినిస్ట్రేషన్‌

ఏళ్లతరబడి పాతుకుపోయారు

దేవదాయ శాఖ అంతర్గత బదిలీలపై విమర్శలు

అమరావతి, జూలై 4 (ఆంధ్రజ్యోతి): దేవదాయ శాఖలో జరుగుతున్న అంతర్గత బదిలీలపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఏళ్ల తరబడి కీలక సెక్షన్లలో పాతుకుపోయిన వారికే మళ్లీ కీలక పోస్టింగ్‌లు ఇస్తున్నారని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. గురువారం పదిమంది కీలక ఉద్యోగుల సెక్షన్లు మారుస్తూ దేవదాయ శాఖ అంతర్గత బదిలీలు చేపట్టింది. దేవదాయ శాఖలో అడ్మినిస్ట్రేషన్‌ సెక్షన్‌ చాలా కీలకం. ఇందులో టెంపుల్‌ ఎంప్లాయిస్‌ సర్వీస్‌ వ్యవహారాలతో పాటు దేవదాలయాల లీజులు, లైసెన్సుల సెక్షన్‌ చాలా కీలకం. ఈ రెండు సెక్షన్లల్లో కొన్నేళ్లుగా పాతుకుపోయిన వారినే అటూ ఇటూ మార్చేశారు. ఏళ్ల తరబడి అడ్మినిస్ట్రేషన్‌, భూముల ఎన్‌వోసీలకు సంబంధించిన సెక్షన్లలో ఉన్న గెజిటెడ్‌ సూపరింటెండెంట్లను దేవదాయ శాఖ ఉన్నతాధికారులు మార్చడం లేదు. విమర్శలు వస్తున్నా వారినే కొనసాగిస్తున్నారు. దీని వల్ల ప్రధాన కార్యాలయంలో కొంత అవినీతి పెరిగిందనే విమర్శలు ఉన్నాయి. ప్రతి మూడు నెలలకు ఒకసారి సెక్షన్లు మారుస్తామన్న నిబంధనలు ఏమయ్యాయనే ప్రశ్నలు వినిపిస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులు ఆలోచించాలని ఉద్యోగులు కోరుతున్నారు.

Updated Date - Jul 05 , 2024 | 06:20 AM