Share News

విద్యుత్తు చార్జీలపై జనవరిలో నిరసనలు: సీపీఎం

ABN , Publish Date - Dec 28 , 2024 | 04:37 AM

విద్యుత్‌ చార్జీల పెంపును నిరసిస్తూ సీపీఎం ఆందోళనలకు పిలుపు ఇచ్చింది. వచ్చే నెల 7, 10 తేదీల్లో విజయవాడ, కర్నూలులో ధర్నాలు, భోగి మంటల్లో చార్జీల పెంపు జీవోలను దహనం చేస్తామని ఆ పార్టీ ఓ ప్రకటనలో పేర్కొంది.

విద్యుత్తు చార్జీలపై జనవరిలో నిరసనలు: సీపీఎం

నరసాపురం, డిసెంబరు 27(ఆంధ్రజ్యోతి): విద్యుత్‌ చార్జీల పెంపును నిరసిస్తూ సీపీఎం ఆందోళనలకు పిలుపు ఇచ్చింది. వచ్చే నెల 7, 10 తేదీల్లో విజయవాడ, కర్నూలులో ధర్నాలు, భోగి మంటల్లో చార్జీల పెంపు జీవోలను దహనం చేస్తామని ఆ పార్టీ ఓ ప్రకటనలో పేర్కొంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 1, 2, 3, 4 తేదీల్లో నెల్లూరు జిల్లాలో సీపీఎం రాష్ట్ర మహాసభలను నిర్వహిస్తున్నట్లు తెలిపింది. సభలకు రాష్ట్రం నలుమూలల నుంచి 470 మంది ప్రతినిధులు హాజరవుతారన్నారు. సమావేశంలో రాష్ట్ర నాయకులు వై.వెంకటేశ్వరావు, మంతెన సీతారాం, జిల్లా కార్యదర్శి బలరాం పాల్గొన్నారు.’

Updated Date - Dec 28 , 2024 | 04:37 AM