PSLV-C60: రేపు పీఎ్‌సఎల్వీ-సీ60 కౌంట్‌డౌన్
ABN , Publish Date - Dec 28 , 2024 | 04:15 AM
శ్రీహరికోటలోని సతీష్ థావన్ అంతరిక్ష కేంద్రం షార్ నుంచి పీఎ్‌సఎల్వీ-సీ60 ప్రయోగానికి కౌంట్‌డౌన్ ఆదివారం ప్రారంభం కానుంది.

సూళ్లూరుపేట, డిసెంబరు 27(ఆంధ్రజ్యోతి): శ్రీహరికోటలోని సతీష్ థావన్ అంతరిక్ష కేంద్రం షార్ నుంచి పీఎ్‌సఎల్వీ-సీ60 ప్రయోగానికి కౌంట్‌డౌన్ ఆదివారం ప్రారంభం కానుంది. ప్రయోగానికి 25గంటల ముందు అంటే రాత్రి 8.58 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభించేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు సన్నాహాలు చేస్తున్నారు. రాకెట్ నాలుగు దశలతో పాటు ఉపగ్రహాల అనుసంధాన పనులను ఇప్పటికే పూర్తి చేశారు. ఈ రాకెట్ ద్వారా స్పేస్ డాకింగ్‌కు చెందిన స్పాడెక్స్ జంట ఉపగ్రహాలను ఇస్రో రోదసిలోకి పంపనుంది. ఈ నెల 30వ తేదీ సోమవారం రాత్రి 9.58 గంటలకు షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి పీఎ్‌సఎల్వీ-సీ60 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. కౌంట్‌డౌన్‌కు సంబంధించిన మిషన్ రెడీనెస్ రివ్యూ (ఎంఆర్‌ఆర్) సమావేశం షార్‌లో శనివారం జరగనుంది. అనంతరం షార్ డైరెక్టర్ ఆర్ముగం రాజరాజన్ అధ్యక్షతన లాంచింగ్ ఆథరైజేషన్ బోర్డు(ల్యాబ్) ప్రయోగానికి సంసిద్ధత తెలుపనుంది.