పత్తి ధర పైపైకి
ABN , Publish Date - Feb 20 , 2024 | 11:56 PM
ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డులో పత్తి ధరలు పెరుగుతున్నాయి. ఐదు రోజులుగా పత్తి ధరలు పెరుగుతుండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
క్వింటాలు రూ.7419
ఆదోని (అగ్రికల్చర్), ఫిబ్రవరి 20: ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డులో పత్తి ధరలు పెరుగుతున్నాయి. ఐదు రోజులుగా పత్తి ధరలు పెరుగుతుండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం గరిష్టంగా పత్తి ధర క్వింటాలు రూ.7419 పలికింది. ఇప్పటికే చిన్న, సన్నకారు రైతులు పత్తి ధరల కోసం వేచి చూసి ధరలు పెరగకపోవడంతో 90 శాతం మంది విక్రయించుకున్నారు. పత్తి విక్రయాలు పేలవంగా సాగుతున్నాయి. పరిశ్రమల్లో ఉత్పత్తికి అవసరమైన పత్తి లేకపోవడంతో డిమాండ్ పెరిగింది. దీంతో పత్తికి డిమాండ్ పెరిగి ధరలు పెరగడానికి కారణమైందని వ్యాపారులు పేర్కొంటున్నారు. అంతర్జాతీయ మార్కెట్లోనూ దూది ధరలు స్వల్పంగా పెరిగాయని తెలిపారు. వారం రోజుల్లో పోల్చితే పత్తి ధర క్వింటానికి రూ.400 పైగా పెరిగింది. పత్తి విక్రయించుకున్నాక ధరలు పెరగడంపై రైతులు నిరాశ చెందుతున్నారు. 1,082 క్వింటాలు పత్తి మార్కెట్ యార్డుకు విక్రయానికి రాగా, క్వింటాలు గరిష్టంగా రూ.7,419, కనిష్టంగా రూ.4,687, మధ్యఽస్థ ధర రూ..6,969 పలికింది.