Share News

నగరంలో అవినీతి‘రాజా’

ABN , Publish Date - Feb 15 , 2024 | 03:44 AM

తూర్పుగోదావరి జిల్లాలోని అధికారపార్టీ ప్రజాప్రతినిధులలో సీఎం జగన్‌కు నమ్మినబంటుల్లో ఆ ఎమ్మెల్యే ఒకరు. రాజకీయ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చారు.

నగరంలో అవినీతి‘రాజా’

కోట్లు కొల్లగొడుతున్న ఎమ్మెల్యే

ఆ నియోజకవర్గానికి అధికారికంగా ఒకరు.. అనధికారికంగా మరో ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు! అంతా కుటుంబ పెత్తనం! ఎమ్మెల్యే అవినీతి‘రాజా’ అయితే.. ఆయన సోదరుడు బ్లేడ్‌ బ్యాచ్‌లు, చిల్లర గ్యాంగ్‌లకు నాయకుడు. ఇక నియోజకవర్గంలో ఎమ్మెల్యే తల్లి పెత్తనమూ ఎక్కువే. తూర్పుగోదావరి జిల్లా ‘నగరం’లో ఏ పని చేయాలన్నా, జరగాలన్నా వారి అనుమతి ఉండాల్సిందే. ఎమ్మెల్యే కన్నుపడితే నియోజకవర్గంలో కొండలు మాయమవుతాయి. చెరువులు లోయలుగా మారుతాయి. అవినీతి గురించి కథలుకథలుగా చెబుతారు. ఆయన ఏది చెప్పినా అధికారులు వినాల్సిందే. లేకుంటే చెంప దెబ్బలు లేదా బదిలీలు తప్పవు. ఆయన సోదరుడు సెటిల్మెంట్లు చేస్తుంటారు. భూములు బాగా ఆక్రమించినట్టు ఆరోపణలున్నాయి. ఈచోటా నాయకుడు ఎవరినైనా నేరుగా బెదిరిస్తారు. ఇతర నియోజకవర్గాల్లోనూ జోక్యం చేసుకుంటుంటారు.

కొత్త ఇల్లు ముచ్చట

గతంలో పొరుగు నియోజకవర్గంలో కాపురం ఉండే సదరు ప్రతినిధి ఇటీవల సొంత నియోజకవర్గంలో కొత్త ఇల్లు కట్టుకున్నారు. రోడ్డు పక్కన విలువైన స్థలంలో రూ.కోట్లతో ఓ అందమైన భవంతిని నిర్మించుకున్నారు. అక్కడ రోడ్డు విస్తరణలో కొందరు ముఖ్యుల దుకాణాలు పోకుండా చూడడం కోసం ఆ స్థలాన్ని ఆయనకు ఇచ్చినట్టు సమాచారం.

కొండలు, చెరువులు తవ్వేసి సొమ్ము

మట్టిని తరలించి రకరకాలుగా దోపిడీ

నాటుసారా, లేఅవుట్లలో మామూళ్లు

మాటవినని అధికారులపై దౌర్జన్యం

పోలీస్‌ స్టేషన్‌లోనే దళిత

యువకుడికి శిరోముండనం

నియోజకవర్గంలో కుటుంబ పెత్తనం

జోరుగా సోదరుడి సెటిల్మెంట్ల దందా

(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)

తూర్పుగోదావరి జిల్లాలోని అధికారపార్టీ ప్రజాప్రతినిధులలో సీఎం జగన్‌కు నమ్మినబంటుల్లో ఆ ఎమ్మెల్యే ఒకరు. రాజకీయ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చారు. పోటీ చేసిన తొలిసారే ఎమ్మెల్యే అయ్యారు. ఆయన తండ్రి ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వంలో కీలకపాత్ర పోషించారు. సదరు నాయకుడు ఓట్లను రాబట్టడంలోనూ, జనాన్ని ఆకట్టుకోవడంలోనూ నేర్పరి. సామాన్య జనానికి పెద్దగా మేలు చేయరు. తనను నమ్మినవాళ్లకు మాత్రమే ‘అక్రమం’గా సహకరిస్తారు. తన మాట వినకపోయినా, తాను చెప్పింది చేయకపోయినా

అధికారులైనా సరే ఆగ్రహానికి గురవుతారు. ఆయన నియోజకవర్గంలో అఽఽధికారులంతా వణుకుతూ బతకాలి. ఇక అక్రమార్జన విషయానికొస్తే అంతూ పొంతూ లేదు. వ్యాపారులు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు, ఎవరైనా ఏ పనిచేయాలన్నా ఆయన అనుమతి తీసుకోవాల్సిందే. మామూళ్లు ముట్ట చెప్పాల్సిందే. ఏ అధికారి అయినా తన కనుసన్నల్లో మసలుకుంటే జనాన్ని దోచుకుని బతికేయొచ్చు. ఆయన చల్లని చూపులో మసలే పోలీసులకు అడ్డూ అదుపూ ఉండదు. కొన్ని పోలీస్‌ స్టేషన్లు సెటిల్‌మెంట్లకు కేంద్రాలుగా మారాయి. ఆయన, ఆయన కుటుంబ సభ్యుల అండతో పోలీసులు, కొందరు అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. జగన్‌ చెప్పినట్టు ఆయన చేయడం వల్ల ఓ ఎత్తిపోతల పథకం కోర్టు కేసులో చిక్కుకుని మూతపడింది. రూ.వేల కోట్లతో నిర్మించిన ఈ పథకం వృథాగా పడి ఉంది. ఎమ్మెల్యే ఘనకార్యాల గురించి కథలుకథలుగా చెప్పుకోవచ్చు.

చెరువులు తవ్వేసి...

నియోజకవర్గంలో చాలా చెరువుల్లో మట్టి తవ్వేశారు. ఓ రజకుల చెరువు పరిస్థితి చూస్తే ఎవరికైనా గుండె చెరువైపోతుంది. అది సుమారు 24 ఎకరాల చెరువు. మొదట ఉపాఽధి హామీ పథకం కింద కొద్దిగా తవ్వి, చుట్టూ గట్టు పటిష్ఠం చేస్తామని అధికారులు చెప్పారు. పైగా బట్టలు ఉతుక్కోవడానికి రేవులు కూడా నిర్మిస్తామన్నారు. కొద్దిరోజులు ఉపాధి కూలీలతో పనిచేశాక యంత్రాలు, లారీలను పిలిపించి రాత్రీ పగళ్లూ తవ్వేశారు. మట్టిని అదే నియోజకవర్గంలోని మరో ఎమ్మెల్యే బంధువులకు చెందిన పెద్ద చెరువు లాంటి స్థలంలోకి తరలించారు. అక్కడ బ్రహ్మాండమైన లేఅవుట్‌ వేశారు. ఆ చెరువులో లోతుగా తవ్వినప్పుడు చట్రు మట్టి దొరికింది. ఇది ఇంకా విలువైనది కావడంతో ఎడాపెడా తవ్వేశారు. దీంతో చెరువు రెండు తాడిచెట్లంత లోతైంది. అధికారులు చెప్పినట్టుగా బట్టలు ఉతుక్కోవడానికి రేవులు కట్టలేదు. ఇటీవల ఓ వ్యక్తి చెరువులో మృతి చెందాడు. ‘ఈ చెరువు చాలా లోతుగా ఉంది. జాగ్రత్త’ అని అక్కడ ఓ స్తంభానికి అధికారులు బోర్డు తగిలించి చేతులు దులుపుకొన్నారు. ఉపాధి హామీ పేరిట కొంత డబ్బు నొక్కేయడంతో పాటు జగనన్న కాలనీలకు మట్టి తోలినట్టు లెక్కలు చూపించి రూ.కోట్లు మింగేశారు.

కొండలు మాయం

కొండల మీద సదరు నేత కన్నుపడితే అంతే సంగతి. పొలాల మధ్య, ఊర్ల మధ్య అందంగా ఊరికి ఆకర్షణగా ఉన్న ఎన్నో కొండలు మాయమైపోయాయి. జగనన్న కాలనీల మెరక పేరిట ఈ మట్టిని ప్రైవేట్‌ లేఅవుట్లకు తరలించి సొమ్ము చేసుకున్నారు. జగనన్న కాలనీలలో ఫిల్లింగ్‌ చేసినట్టు కూడా డబ్బు కొట్టేశారు. కొండలను చట్టవిరుద్ధంగా తవ్వేశారని ఓ వ్యక్తి గ్రీన్‌ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించగా.. విచారణ చేయాలని కలెక్టర్‌, ఇతర అధికారులను ఆదేశించింది. అక్రమాలు జరిగాయని తేలడంతో రూ.3.50 కోట్ల వరకూ జరిమానా విధించింది. వైసీపీ ప్రభుత్వం వచ్చాక నాటు సారా అమ్మకాలు పెరిగాయి. సదరు ప్రజాప్రతినిధి నియోజకవర్గంలో నాటు సారా కాసేవాళ్లు, అమ్మేవాళ్లు చాలామంది ఉన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులకు కూ డా ఆదాయం వస్తుంది. ఓ బట్టీ పెడితే లక్ష వరకూ లంచాలు వస్తాయి. ఎమ్మెల్యే అండదండలతో యథేచ్ఛగా నాటుసారా తయారు చేస్తున్నారు.

లేఅవుట్లలో వాటా

నియోజకవర్గ పరిధిలో ఏ లేఅవుట్‌ వేసినా ఎమ్మె ల్యే అనుమతి అవసరం. పైగా 5 శాతం వాటా లేదా దానికి తగిన డబ్బు ఇవ్వాలి. దీంతో చాలామంది లేఅవుట్లు వేయడం మానేశారు. ప్రస్తుతం కనిపించే లేఅవుట్లన్నీ ఆయన కనుసన్నలలో ఉంటాయి. వాటి స్థలా ల ఫిల్లింగ్‌, రోడ్ల నిర్మాణానికి ఆయా ప్రాంతాలలోని చెరువులు, కొండల్నే వాడతారు. జిల్లా కేంద్రానికి కొద్ది దూరంలో జాతీయ రహదారి పక్క ఎవరికో చెందిన కోట్ల విలువ చేసే పూర్వపు ఆస్థిని బినామీ పేర్లతో రిజిస్ర్టేషన్‌ చేయించడంతో ఆ ప్రజాప్రతినిధి, ఆయన బంధువు ప్రమేయం ఉందనే ప్రచారం ఉంది. జిల్లా కేంద్రంలో ఓ ప్రభుత్వ శాఖకు చెందిన విలువైన 2 ఎకరాల స్థలాన్ని వైసీపీ కార్యాలయ నిర్మాణానికి కట్టబెట్టడంలో ఆయన కీలక ప్రాత పోషించినట్టు తెలుస్తోం ది. అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని వైసీపీ వర్గీయులను అడ్డుకు న్న ఓ దళిత యువకుడిని తీసుకెళ్లి ఏకంగా పోలీసు స్టేషన్‌లో పోలీసులే గుండు కొట్టారు. ఇం తవరకూ వైసీపీ నేతల మీద కా నీ, పోలీసుల మీద కానీ చర్యలు లేవు. సాక్షాత్తూ రాష్ట్రపతి ఈ కేసులో జోక్యం చేసుకున్నా పురోగతి లేదు.

అధికారులు హడల్‌

సదరు ఎమ్మెల్యే దెబ్బకు నియోజకవర్గంలో అధికారులు హడలిపోతున్నారు. ఓ కాలువ పనులకు సం బంధించి సుమారు రూ.3 కోట్లు బిల్లులు చేయాలని సదరు నాయకుడు సంబంధిత అధికారిని ఆదేశించా రు. నిబంధనలకు విరుద్ధంగా తప్పుచేయడానికి ఆ అధికారి భయపడి కొద్దిరోజులు జాప్యం చేశారు. ఎమ్మెల్యేకు కోపం వచ్చి ఓ రోజున ఆ అధికారి చెంప పగలు కొట్టారు. దీంతో ఇంజనీర్లంతా ఆందోళన చేయడానికి పూనుకున్నారు. కానీ సార్‌ పైఅధికారుల నుంచి నరుక్కొచ్చి చీకట్లో సారీ చెప్పి చేతులు కడిగేసుకున్నారు. ఇటీవల సదరు నేత ఓ సామాజిక వర్గానికి కమ్యూనిటీ హాల్‌ నిర్మాణం కోసం స్థలం ఇప్పించి, నిబంధనలకు విరుద్ధంగా కొందరి పేరు మీద ఆ స్థలాన్ని రిజిస్ర్టేషన్‌ చేయించాలని సబ్‌ రిజిస్ర్టార్‌కు ఫోన్‌ చేసి చెప్పారు. దానికి అవసరమైన డబ్బంతా సబ్‌ రిజిస్ర్టారే పెట్టుకోవాలని ఆదేశించారు. దీంతో ఆ అధికారి ‘ఇతర ఖర్చులన్నీ వదిలేస్తాం. కానీ ప్రభుత్వానికి కట్టాల్సిన స్టాంప్‌ డ్యూటీ నేను కట్టలేను’ అని అన్నారు. అంతే... సార్‌కు కోపం వచ్చి ‘నువ్వెంత లంచాలు తీసుకుంటున్నావో నాకు తెలియదా? నోర్మూసుకుని చెప్పింది చెయ్‌’ అని ఆదేశించారు.

మూడు చోట్ల పెత్తనం

ఎమ్మెల్యే సోదరుడు.. బ్లేడ్‌ బ్యాచ్‌లు, పోరంబోకుల కు మహానేత. వారంతా ఆయనను దేవుడిలా చూస్తా రు. ఆయనకు వైసీపీ యూత్‌ వింగ్‌లో ఓ కీలక పదవి కూడా ఉంది. నియోజకవర్గంలోనే గాక పొరుగునే ఉ న్న మరో రెండు నియోజకవర్గాల్లోనూ ఎమ్మెల్యే కు టుంబం పెత్తనం చేస్తోంది.

Updated Date - Feb 15 , 2024 | 03:44 AM