Share News

కంట్రోల్ రూం నివేదికలను ఎప్పటికప్పుడు పంపాలన్నారు

ABN , Publish Date - Mar 22 , 2024 | 11:35 PM

సార్వత్రిక ఎన్నికలు- 2024 కొరకు జిల్లా కలెక్టరేట్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్‌ కంట్రోల్‌ రూమ్‌ నుంచి రోజువారి నివేదికలను ఎప్పటికప్పుడు ఎన్నికల కమిషన్‌కు పంపించాలని జిల్లా ఎన్నికల అధికారి అభిషిక్త్‌కిశోర్‌ నోడల్‌ అధికారులను ఆదేశించారు.

 కంట్రోల్ రూం నివేదికలను ఎప్పటికప్పుడు పంపాలన్నారు
వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న కలెక్టర్‌ అభిషిక్త్‌కిశోర్‌

జిల్లా ఎన్నికల అధికారి అభిషిక్త్‌కిశోర్‌

రాయచోటి(కలెక్టరేట్‌), మార్చి 22: సార్వత్రిక ఎన్నికలు- 2024 కొరకు జిల్లా కలెక్టరేట్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్‌ కంట్రోల్‌ రూమ్‌ నుంచి రోజువారి నివేదికలను ఎప్పటికప్పుడు ఎన్నికల కమిషన్‌కు పంపించాలని జిల్లా ఎన్నికల అధికారి అభిషిక్త్‌కిశోర్‌ నోడల్‌ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఉదయం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేశ్‌కుమార్‌మీనా, విజయవాడ నుంచి అన్ని జిల్లా కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సార్వత్రిక ఎన్నికలు- 2024పై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి రాయచోటి కలెక్టరేట్‌ నుంచి జిల్లా ఎన్నికల అధికారి అభిషిక్త్‌కిశోర్‌, జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖేశ్‌కుమార్‌మీనా మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికలకు సంబంఽధించి అన్ని విషయాల్లో సిద్ధంగా ఉండాలన్నారు. ఫారం-6, ఎంసీసీ, ఈఎస్‌ఎంఎస్‌, ఎఫ్‌ఎస్‌టీ తదితర అంశాలకు సంబంధించిన నివేదికలను ప్రతి రోజు సీఈవో కార్యాలయానికి తగిన సమయంలో చేరవేయాలన్నారు. అనంతరం జిల్లా ఎన్నికల అధికారి అభిషిక్త్‌కిశోర్‌ మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికలు 2024కు సంబంధించి రోజువారి నివేదికలను ఎప్పటికప్పుడు ఎన్నికల సంఘానికి అందజేయాలని, ఈ విషయంలో ఎటువంటి అలసత్వాన్ని ప్రదర్శించరాదని నోడల్‌ అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో ఎన్నికల విధుల్లో ఉన్న నోడల్‌ అధికారులు, ఎలెక్షన్‌ సెల్‌ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

టోల్‌ ఫ్రీ నెంబర్‌ను సద్వినియోగం చేసుకోండి

ఎన్నికల ఫిర్యాదులు, ఇతర వివరాల కోసం ఏర్పాటు చేసిన టోల్‌ ఫ్రీ నెంబర్‌ను (18004257090)ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి అభిషిక్త్‌కిశోర్‌ జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. శుక్రవారం సాయంత్రం సార్వత్రిక ఎన్నికలు-2024కు సంబంధించి ఫిర్యాదులు, ఇతర వివరాలకు రాయచోటి కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన టోల్‌ ఫ్రీ నెంబర్‌ను ఆయన ప్రారంభించారు. ఈ టోల్‌ఫ్రీ నెంబర్‌ 24 ఇంటు 7 పనిచేస్తుందని, ఫిర్యాదుల కొరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టోల్‌ ఫ్రీ నెంబర్‌ 1950 అదనంగా పనిచేస్తుందన్నారు.

Updated Date - Mar 22 , 2024 | 11:35 PM