Share News

సా్ట్రంగ్‌ రూం ఏర్పాటుకు డిగ్రీ కళాశాల పరిశీలన

ABN , Publish Date - Mar 06 , 2024 | 12:03 AM

త్వరలో జరగను న్న సార్వత్రిక ఎన్నికల కోసం పీలేరు నియోజకవర్గానికి సా్ట్రంగ్‌ రూం, డిసి్ట్ర బ్యూషన సెంటర్‌ ఏర్పాటు కోసం పీలేరులోని సంజయ్‌ గాంధీ డిగ్రీ కళాశాలను జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన అహ్మద్‌ పరిశీలించారు.

సా్ట్రంగ్‌ రూం ఏర్పాటుకు డిగ్రీ కళాశాల పరిశీలన
ఎస్‌జీ డిగ్రీ కళాశాలను సందర్శిస్తున్న జేసీ ఫర్మాన అహ్మద్‌, అధికారులు

పీలేరు, మార్చి 5: త్వరలో జరగను న్న సార్వత్రిక ఎన్నికల కోసం పీలేరు నియోజకవర్గానికి సా్ట్రంగ్‌ రూం, డిసి్ట్ర బ్యూషన సెంటర్‌ ఏర్పాటు కోసం పీలేరులోని సంజయ్‌ గాంధీ డిగ్రీ కళాశాలను జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన అహ్మద్‌ పరిశీలించారు. మంగళవారం పీలేరు నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి అయిన జేసీ, పీలేరు నియోజకవర్గ ఈఆర్‌వో రమా నేతృత్వం లో అధికారులు కళాశాల పరిసరాలను సందర్శించారు. గతంలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో సా్ట్రంగ్‌ రూం ఏర్పాటుకు తలపెట్టిన అధికారులు అక్కడ సరైన సదుపాయా లు లేకపోవడంతో మార్పునకు నిర్ణ యించారు. ఈ క్రమంలో డిగ్రీ కళాశాలలోని వివిధ గదులు, క్రీడా మైదానాన్ని అధికారు లు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దారు మహబూబ్‌ బాషా పాల్గొన్నారు.

Updated Date - Mar 06 , 2024 | 12:03 AM