Share News

ప్రజాస్వామ్యంలో తులనాత్మక న్యాయవ్యవస్థ కీలకం

ABN , Publish Date - Feb 17 , 2024 | 03:33 AM

ప్రస్తుత అంతర్జాతీయ, ఆర్థిక ప్రపంచీకరణ, ప్రజాస్వామ్యీకరణలో కంపారిటివ్‌ లా (తులనాత్మక న్యాయవ్యవస్థ) కీలక పాత్ర పోషిస్తుందని సుప్రీం కోర్టు రిటైర్డ్‌ జడ్జి జస్టిస్‌ రవీంద్ర భట్‌ అన్నారు.

ప్రజాస్వామ్యంలో తులనాత్మక న్యాయవ్యవస్థ కీలకం

సుప్రీం కోర్టు రిటైర్డ్‌ జడ్జి జస్టిస్‌ రవీంద్ర భట్‌

కంపారిటివ్‌ లాపై విట్‌-ఏపీలో మూడు రోజుల సదస్సు

అమరావతి, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి): ప్రస్తుత అంతర్జాతీయ, ఆర్థిక ప్రపంచీకరణ, ప్రజాస్వామ్యీకరణలో కంపారిటివ్‌ లా (తులనాత్మక న్యాయవ్యవస్థ) కీలక పాత్ర పోషిస్తుందని సుప్రీం కోర్టు రిటైర్డ్‌ జడ్జి జస్టిస్‌ రవీంద్ర భట్‌ అన్నారు. విట్‌-ఏపీ యూనివర్సిటీ స్కూల్‌ ఆఫ్‌ లా (వీఎ్‌సఎల్‌), విట్‌-ఏపీ యూనివర్సిటీ, బర్మింగ్‌హమ్‌ స్కూల్‌ ఆఫ్‌ లా, యూనివర్సిటీ ఆఫ్‌ బర్మింగ్‌హామ్‌ సంయుక్తంగా మూడు రోజులపాటు నిర్వహిస్తున్న ‘ఇంటర్నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఆన్‌ కంపారిటివ్‌ లా’ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తులనాత్మక న్యాయవ్యవస్థను వివిధ దేశాల న్యాయవ్యవస్థల మధ్య వ్యత్యాసాలు, సారూప్యతల అధ్యయనంగా అభివర్ణించారు. మూడు రోజులపాటు కొనసాగే ఈ సదస్సు విట్‌-ఏపీ క్యాంప్‌సలో గురువారం ప్రారంభమైంది. శనివారం ముగుస్తుంది. కార్యక్రమంలో విట్‌-ఏపీ యూనివర్సిటీ వీసీ డాక్టర్‌ ఎస్వీ కోట రెడ్డి, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ జగదీశ్‌ చంద్ర, విట్‌-ఏపీ స్కూల్‌ ఆఫ్‌ లా డీన్‌ డాక్టర్‌ బెనర్జీ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 17 , 2024 | 10:35 AM