విశాఖలో ‘సింబెక్స్-2024’ ప్రారంభం
ABN , Publish Date - Oct 25 , 2024 | 04:42 AM
భారత్, సింగపూర్ నేవీ దళాలు పాలుపంచుకొనే ‘సింగపూర్-ఇండియా మేరిటైమ్ బైలేటరల్ ఎక్సర్‌సైజ్ (సింబెక్స్)-2024’ కార్యక్రమం గురువారం విశాఖపట్నంలోని తూర్పు నౌకాదళంలో ప్రారంభమైంది.

విశాఖపట్నం, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): భారత్, సింగపూర్ నేవీ దళాలు పాలుపంచుకొనే ‘సింగపూర్-ఇండియా మేరిటైమ్ బైలేటరల్ ఎక్సర్‌సైజ్ (సింబెక్స్)-2024’ కార్యక్రమం గురువారం విశాఖపట్నంలోని తూర్పు నౌకాదళంలో ప్రారంభమైంది. ఈనెల 29వ తేదీ వరకు రెండు దేశాలు సైనిక విన్యాసాలు నిర్వహిస్తాయి. శుక్రవారం వరకు హార్బర్‌లో, 26 నుంచి 29వ తేదీ వరకు సముద్రంలో.. రెండు దశల్లో కార్యక్రమాలు జరుగుతాయి. రెండు దేశాల మధ్య మరింత సహకారం, తీర ప్రాంత రక్షణపై అవగాహన, సముద్ర జలాల పరిరక్షణలో ఉమ్మడి సవాళ్లపై ఈ ఏడాది చర్చించాలని నిర్ణయించారు. ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని యుద్ధ నౌక ‘ఐఎన్‌ఎస్ శివాలిక్’’పై నిర్వహించారు. భారత నౌకాదళం, రిపబ్లిక్ ఆఫ్ సింగపూర్ నేవీ అధికారులు పాల్గొన్నారు.