Share News

మీకు ఇష్టమైన భాషను ఎంచుకోండి

5న తుది విచారణకు రండి

ABN , Publish Date - Mar 03 , 2024 | 02:54 AM

వైసీపీని వీడిన ఎమ్మెల్సీలు సి.రామచంద్రయ్య, వంశీకృష్ణకు శాసనమండలి చైర్మన్‌ కొయ్యే మోసేన్‌రాజు నోటీసు జారీ చేశారు.

5న తుది విచారణకు రండి

వైసీపీని వీడిన ఎమ్మెల్సీలకు మండలి చైర్మన్‌ మోషేన్‌రాజు నోటీసు

అమరావతి, మార్చి 2(ఆంధ్రజ్యోతి): వైసీపీని వీడిన ఎమ్మెల్సీలు సి.రామచంద్రయ్య, వంశీకృష్ణకు శాసనమండలి చైర్మన్‌ కొయ్యే మోసేన్‌రాజు నోటీసు జారీ చేశారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద ఎందుకు క్రమశిక్షణ చర్యలు తీసుకోరాదో తెలపాలని స్పష్టం చేశారు. ఈ నెల ఐదో తేదీన జరిపే తుది విచారణకు హాజరు కావాలని వీరిద్దరినీ కోరారు. ఇటీవల ఎనిమిది మంది తెలుగుదేశం, వైసీపీ ఎమ్మెల్యేలపై సభాపతి తమ్మినేని సీతారాం వేటు వేశారు. ఇప్పుడు ఎమ్మెల్పీలు ఇద్దరిపైనా అనర్హత వేటు వేయడం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య టీడీపీలోనూ .. వంశీకృష్ణ జనసేనలోనూ చేరిన విషయం తెలిసిందే.

Updated Date - Mar 03 , 2024 | 08:42 AM