Share News

3, 4 తేదీల్లో కలెక్టర్ల సదస్సు

ABN , Publish Date - Nov 28 , 2024 | 06:27 AM

జిల్లా కలెక్టర్ల సదస్సు నిర్వహణకు షెడ్యూల్‌ ఖరారైంది. అమరావతి సచివాలయంలో డిసెంబరు 3, 4 తేదీల్లో

3, 4 తేదీల్లో కలెక్టర్ల సదస్సు

అమరావతి, నవంబరు 27(ఆంధ్రజ్యోతి): జిల్లా కలెక్టర్ల సదస్సు నిర్వహణకు షెడ్యూల్‌ ఖరారైంది. అమరావతి సచివాలయంలో డిసెంబరు 3, 4 తేదీల్లో ఈ సమావేశాలు నిర్వహించనున్నారు. ప్రజాసంక్షేమం, రాష్ట్రాభివృద్ధి, 100 రోజుల పాలనా లక్ష్యాలు, తొలి కలెక్టర్ల సమావేశంలో ఇచ్చిన అజెండా అమలు, తదితర అంశాలపై కలెక్టర్లతో ప్రభుత్వం చర్చించనుంది. ఇసుక, సహజ వనరులు, భూ కుంభకోణాలు, శ్వేతపత్రాల విడుదల అనంతరం అందులోని అంశాలపై జిల్లాల వారీగా కలెక్టర్లు తీసుకున్న నిర్ణయాలు, భూ రికార్డుల పునఃపరిశీలన, నూతన పరిశ్రమల ఏర్పాటు, గంజాయి, ఇతర మాదకద్రవ్యాల కట్టడి, శాంతిభద్రతలు, సోషల్‌మీడియాలో సైకోల అరాచకం, వ్యవసాయం, నీటిపారుదల తదితర అంశాలపైనా చర్చిస్తారు. తొలి కలెక్టర్ల సమావేశం అనంతరం ప్రభుత్వం ఆయా శాఖలు, జిల్లాలకు 100 రోజుల లక్ష్యాలను నిర్దేశించింది.

Updated Date - Nov 28 , 2024 | 06:27 AM