Share News

ఎనఈపీని తిరస్కరించాలంటూ సంతకాల సేకరణ

ABN , Publish Date - Feb 02 , 2024 | 11:36 PM

జాతీయ విద్యావిధానం-2020 (ఎన ఈపీ)ని తిరస్కరించాలని పిలుపుని స్తూ ఏఐఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో సంత కాల సేకరణ కార్యక్రమం నిర్వహిం చారు.

ఎనఈపీని తిరస్కరించాలంటూ సంతకాల సేకరణ
ప్రజలు, విద్యార్థుల నుంచి సంతకాలు సేకరిస్తున్న ఏఐఎస్‌ఎఫ్‌ నాయకులు

మదనపల్లె టౌన, ఫిబ్రవరి 2: జాతీయ విద్యావిధానం-2020 (ఎన ఈపీ)ని తిరస్కరించాలని పిలుపుని స్తూ ఏఐఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో సంత కాల సేకరణ కార్యక్రమం నిర్వహిం చారు. శుక్రవారం స్థానిక జడ్పీహై స్కూల్‌ వద్ద నిర్వహించిన ఈ కార్య క్రమంలో సీపీఐ నేత మురళి, ఎస్టీయూ రాష్ట్ర కార్యదర్శి ఆర్‌వీ రమణ మాట్లాడు తూ ఎనఈపీ విధానం వలన విద్యార్థు లు సంక్షోభంలో చిక్కుపోతున్నారన్నారు. దీనివల్ల అట్టడుగు వర్గాల్లోని విద్యార్థులు ఎలాం టి ఉపయోగం ఉండదన్నారు. ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు మాధవ్‌ మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం ఎనఈపీ విధానం వలన ఉన్నత వర్గాల వారికి మేలు కలిగించేలా రూపొందిం చారన్నారు. ఇలాంటి విధానం వలన ప్రజలకు, పేద విద్యార్థులకు న్యాయం జరగదన్నారు. ఈ విధానాన్ని తిరస్కరిస్తూ ప్రజల నుంచి సంతకాల సేకరణ చేసి కేంద్రానికి పంపుతా మన్నారు. కార్యక్ర మంలో ఏఐఎస్‌ఎఫ్‌ నాయకులు భవిత, ఓబులేసు, వినయ్‌, శ్రీనాథ్‌, గణేష్‌ పాల్గొన్నారు.

Updated Date - Feb 02 , 2024 | 11:36 PM