సచివాలయ భవనాల తాకట్టా!?
ABN , Publish Date - Mar 04 , 2024 | 03:19 AM
ప్రభుత్వ పరిపాలనా వ్యవస్థకు గుండెకాయలాంటి రాష్ట్ర సచివాలయాన్ని తాకట్టు పెట్టి అప్పు తేవడం రాష్ట్రానికి అవమానకరమని టీడీపీ అధినేత చంద్రబాబు ఆక్షేపించారు.
ఇది రాష్ట్రానికి అవమానకరం: చంద్రబాబు
అమరావతి, మార్చి 3(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పరిపాలనా వ్యవస్థకు గుండెకాయలాంటి రాష్ట్ర సచివాలయాన్ని తాకట్టు పెట్టి అప్పు తేవడం రాష్ట్రానికి అవమానకరమని టీడీపీ అధినేత చంద్రబాబు ఆక్షేపించారు. ఆదివారం ఎక్స్ వేదికగా ‘ఆంధ్రజ్యోతి’లో తాకట్టులో సచివాలయం కథనం క్లిప్పింగ్‌ను జోడించి, దానిపై స్పందించారు. రాష్ట్రానికి అవమానకరం, బాధాకరం, సిగ్గు చేటని పేర్కొన్నారు. రూ.370 కోట్లకు రాష్ట్ర ముఖ్యమంత్రి కూర్చునే భవనాన్ని, రాష్ట్ర పాలనా కేంద్రాన్ని తాకట్టు పెట్టడం అంటే ఏంటో ఈ సీఎంకి తెలుసా? అని ప్రశ్నించారు. ‘నువ్వు తాకట్టు పెట్టింది కేవలం భవనాలను కాదు. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని. నువ్వు నాశనం చేసింది సమున్నతమైన ఆంధ్రప్రదేశ్ బ్రాండ్‌ని. ప్రజలారా.. అసమర్థ, అహంకార, విధ్వంస పాలనలో మనం ఏం కోల్పోతున్నామో ఆలోచించండి’ అని ఎక్స్‌లో వ్యాఖ్యానించారు.
బాలయోగి చంద్రబాబు నివాళులు
మాజీ లోక్‌సభ స్పీకర్ జీఎంసీ బాలయోగి వర్ధంతి సందర్భంగా చంద్రబాబు ఎక్స్ ద్వారా నివాళులర్పించారు. సాధారణ రైతు కుటుంబంలో పుట్టి, దేశంలోనే అత్యున్నతమైన లోక్‌సభకు రెండుసార్లు స్పీకర్‌గా పనిచేసిన ఘనతను సాధించిన తెలుగు తేజం బాలయోగి అంటూ కొనియాడారు.