Share News

గంగవరం నుంచి విశాఖ పోర్టుకు బొగ్గు నౌకలు

ABN , Publish Date - Apr 19 , 2024 | 04:49 AM

విశాఖపట్నం స్టీల్‌ప్లాంటు ఆస్ట్రేలియా నుంచి రెండు నౌకల ద్వారా తెప్పించుకున్న కోకింగ్‌ కోల్‌ను అదానీ గంగవరం పోర్టు నుంచి విశాఖపట్నం పోర్టుకు

గంగవరం నుంచి విశాఖ పోర్టుకు బొగ్గు నౌకలు

అక్కడ నుంచి రోడ్డు మార్గాన స్టీల్‌ప్లాంటుకు తరలింపు

సెయిల్‌ నుంచి కూడా ఎనిమిది వేల టన్నుల బొగ్గు

విశాఖపట్నం, ఏప్రిల్‌ 18 (ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం స్టీల్‌ప్లాంటు ఆస్ట్రేలియా నుంచి రెండు నౌకల ద్వారా తెప్పించుకున్న కోకింగ్‌ కోల్‌ను అదానీ గంగవరం పోర్టు నుంచి విశాఖపట్నం పోర్టుకు తరలించారు. ఈ నౌకలు వారం క్రితం అదానీ పోర్టుకు రాగా కార్మికుల ఆందోళన కారణంగా యాజమాన్యం వాటికి బెర్తులు కేటాయించకుండా అలాగే ఉంచేసింది. దాంతో విశాఖ ఉక్కు బొగ్గు కొరత ఎదుర్కొంటోంది. ఆ రెండు నౌకల్లో 1.5 లక్షల టన్నుల బొగ్గు ఉంది. గురువారం విశాఖపట్నం పోర్టుకు చేరిన ఆ నౌకల నుంచి బొగ్గును రోడ్డు మార్గాన స్టీల్‌ప్లాంటుకు తీసుకురానున్నట్టు ఉక్కు పోరాట కమిటీ సభ్యులు వరసాల శ్రీనివాసరావు తెలిపారు. బొగ్గుతో పాటు లైమ్‌ స్టోన్‌ కూడా 50 వేల టన్నులు ఉందన్నారు. ఇదిలావుండగా సెయిల్‌ నుంచి 8 వేల టన్నుల కోకింగ్‌ కోల్‌ తీసుకున్నారని, అందులో 4 వేల టన్నులు ఇప్పటికే రాగా మిగిలిన 4 వేల టన్నులు శుక్రవారం వస్తుందన్నారు.

Updated Date - Apr 19 , 2024 | 04:49 AM