సీఎం రాజీనామా చెయ్యాలి
ABN , Publish Date - Apr 03 , 2024 | 12:57 AM
ఎపీపీఎస్సీలో జరిగిన అవకతవకలపై నైతిక బాధ్యత వహిస్తూ సీఎం జగన్ రెడ్డి రాజీనామా చెయ్యాలని టీఎన్‌ఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు డిమాండ్ చేశారు.

ఆదోని, ఏప్రిల్ 2: ఎపీపీఎస్సీలో జరిగిన అవకతవకలపై నైతిక బాధ్యత వహిస్తూ సీఎం జగన్ రెడ్డి రాజీనామా చెయ్యాలని టీఎన్‌ఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక త్రీటౌన్ సీఐ నరసింహరాజుకు వినతిపత్రం అందజేశారు. ఏపీ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో జరిగిన అవకతవకల పై విచారణ చేపట్టాలని కోరారు. జవాబు పత్రాలను మార్చడం, అభ్యర్థులను ఎంపిక చెయ్యడం ద్వారా సాక్ష్యాలను నాశనం చేస్తూ తప్పుడు సమాచారం ఇచ్చిన సీఎంపై, ఆనాటి ఏపీపీఎస్సీ కార్యదర్శి పీఎస్‌ఆర్ ఆంజనేయులు, ఎపీపీఎస్సీ చైర్ పర్సన్ గౌతం సవాంగ్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి పై నేరపూరిత కుట్ర కింద కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. టీఎన్‌ఎస్‌ఎఫ్ జిల్లా నాయకులు బోయ తేజ, పద్మశాలి రమేష్, పట్టణ ప్రధాన కార్యదర్శి బిల్లేకల్ సూర్య, నాయకులు నూర్ బాషా, సాయి, రఘు, పాల్గొన్నారు.