ఆర్జీయూకేటీ చాన్స్‌లర్‌గా సీఎం

ABN , First Publish Date - 2024-02-08T02:52:27+05:30 IST

రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ అండ్‌ టెక్నాలజీ్‌స(ఆర్జీయూకేటీ) చాన్స్‌లర్‌గా ముఖ్యమంత్రి వ్యవహరించనున్నారు. ఈ మేరకు

ఆర్జీయూకేటీ చాన్స్‌లర్‌గా సీఎం

అమరావతి, ఫిబ్రవరి 7(ఆంధ్రజ్యోతి): రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ అండ్‌ టెక్నాలజీ్‌స(ఆర్జీయూకేటీ) చాన్స్‌లర్‌గా ముఖ్యమంత్రి వ్యవహరించనున్నారు. ఈ మేరకు ఆర్జీయూకేటీ-2008 చట్టానికి ప్రభుత్వం సవరణ చేసింది. ఈ సవరణ బిల్లుకు బుధవారం శాసనసభ ఆమోదం లభించింది. వైఎస్‌ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఆర్జీయూకేటీ యూనివర్సిటీని ప్రారంభించి, రాష్ట్రంలో నాలుగు క్యాంప్‌సలు ఏర్పాటు చేశారు. అయితే, ఇది యూజీసీ నిధులతో సంబంధం లేకుండా సొంతంగా ఏర్పాటు చేసుకున్న యూనివర్సిటీ కావడంతో అప్పట్లో వైఎ్‌సకి సన్నిహితుడిగా ఉన్న కేసీ రెడ్డిని చాన్స్‌లర్‌గా నియమించారు.

Updated Date - 2024-02-08T02:52:27+05:30 IST