Share News

మీకు ఇష్టమైన భాషను ఎంచుకోండి

సమాజ ఉమ్మడి ఆస్తిగా బూతులు

ABN , Publish Date - Mar 04 , 2024 | 03:22 AM

‘ప్రస్తుతం బూతులు సమాజ ఉమ్మడి ఆస్తిగా మారిపోయాయి. మనకు ఉన్నవి ఏమిటని చూస్తే బూతులు,

సమాజ ఉమ్మడి ఆస్తిగా బూతులు

దీన్ని సభ్యసమాజం హర్షించడం లేదు: జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి

విజయవాడ కల్చరల్‌, మార్చి 3: ‘ప్రస్తుతం బూతులు సమాజ ఉమ్మడి ఆస్తిగా మారిపోయాయి. మనకు ఉన్నవి ఏమిటని చూస్తే బూతులు, విద్వేషమే కనిపిస్తున్నాయి. దీనిపై చర్చించకపోతే బూతు భాష సమజానికి మనమిచ్చే వారసత్వం అవుతుంది’ అని జస్టిస్‌ బి.సుదర్శన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడ బుక్‌ ఫెస్టివల్‌ సొసైటీ నూతనంగా నిర్మించిన నాలుగో అంతస్తును ఆదివారం ఆయన ప్రారంభించారు. అనంతరం ‘ప్రసార మాధ్యమాల్లో రాజకీయ పరిభాష’ అంశంపై నిర్వహించిన రౌండ్‌టేబుల్‌ సమావేశంలో మాట్లాడారు. భావోద్వేగాలు లేకుండా రాజకీయాలు నడపాలని అభిప్రాయపడ్డారు. తీవ్రమైన పదజాలం ఉపయోగించకూడదని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. రాజకీయ పార్టీల సిద్ధాంతాలు, రాద్ధాంతాలు ఎలా ఉన్నా బూతుల జోలికి నేతలు వెళ్లడంపై ప్రజలు అసహ్యం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. రాజకీయ నేతలు దారుణంగా మాట్లాడుతున్న బూతులను సభ్యసమాజం హర్షించడం లేదన్నారు. అన్‌పార్లమెంటరీ పదాలను రోజూ పార్లమెంటులోనే వాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ మాట్లాడుతూ జనం దేన్ని ఎక్కువగా ఇష్టపడితే దానినే మీడియా చూపిస్తోందని, మీడియా దేన్ని ఎక్కువగా చూపిస్తుందో దాన్నే రాజకీయ నేతలు మాట్లాడుతున్నారని వివరించారు. ప్రజాసేవ చేయడానికి వచ్చిన వారికి ఎందుకంత కోపం వస్తుందని ప్రశ్నించారు. బూతులు మాట్లాడేవారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చని తెలిపారు. కార్యక్రమంలో ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి అధ్యక్షుడు చలసాని విజయ్‌కుమార్‌, సీనియర్‌ సంపాదకుడు కె.రామచంద్రమూర్తి, ఎమెస్కో విజయ్‌కుమార్‌, జర్మనీ మాజీ మేయర్‌ గుజ్జుల రవీంద్ర, వీబీఎ్‌ఫఎస్‌ అధ్యక్షుడు మనోహరనాయుడు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 04 , 2024 | 09:49 AM