Share News

చకచకా పనులు

ABN , Publish Date - Jun 10 , 2024 | 03:43 AM

ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి.

చకచకా పనులు

చద్రబాబు ప్రమాణ స్వీకార ఏర్పాట్లు పరిశీలించిన సీఎస్‌, డీజీపీ

టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కూడా..

గన్నవరం, జూన్‌ 9: ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఈ నెల 12వ తేదీన కృష్ణాజిల్లా గన్నవరం మండలం కేసరపల్లిలో నిర్వహించే ప్రమాణ స్వీకార కార్యక్రమం కోసం 17 ఎకరాల విస్తీర్ణంలో సీనియర్‌ అధికారులు, టీడీపీ నేతల పర్యవేక్షణలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పనులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్‌) నీరబ్‌ కుమార్‌ ప్రసాద్‌, డీజీపీ హరీశ్‌ కుమార్‌ గుప్తా, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తదితరులు ఆదివారం పరిశీలించారు. 60 మంది కూర్చునే విధంగా 80 అడుగుల వెడల్పు, 60 అడుగుల పొడువు, 8 అడుగల ఎత్తులో స్టేజీని నిర్మిస్తున్నారు. వీవీఐపీలు, వీఐపీలు, ప్రజల కోసం 800 అడుగుల పొడవు, 420 అడుగుల వెడల్పు ఉన్న జర్మన్‌ హ్యాంగర్స్‌ ఏర్పాటు చేస్తున్నారు. ప్రధాని మోదీతోపాటు, పలు రాష్ర్టాల ముఖ్యమంత్రులు, ఇతర ప్రముఖులు వస్తుండటంతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. విమానాశ్రయం నుంచి నేరుగా సభాస్థలికి వచ్చేందుకు స్జేజీ వెనుకనున్న క్వారీ గోతులను పూడ్చి వేశారు. స్జేజీ ఎదురుగా డి.జోన్‌ బ్లాక్‌, ఆ తరువాత వీవీఐపీ, వీఐపీ బ్లాక్‌లు ఏర్పాటు చేస్తున్నారు.

Updated Date - Jun 10 , 2024 | 03:44 AM