సీఎంసీవో లేఖల జారీపై స్పష్టత ఇవ్వండి
ABN , Publish Date - Mar 22 , 2024 | 03:38 AM
సీఎంసీవో రిఫరల్ లేఖలపై ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌లో కదలిక వచ్చింది. పేద ప్రజలకు ఉపయోగపడే ఈ లేఖలను రెండు రోజుల నుంచి ట్రస్ట్ అధికారులు నిలిపివేయడంతో రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
అమరావతి, మార్చి 21(ఆంధ్రజ్యోతి): సీఎంసీవో రిఫరల్ లేఖలపై ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌లో కదలిక వచ్చింది. పేద ప్రజలకు ఉపయోగపడే ఈ లేఖలను రెండు రోజుల నుంచి ట్రస్ట్ అధికారులు నిలిపివేయడంతో రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ విషయాన్ని ‘రోగులతో చెలగాటం’ శీర్షికతో ‘ఆంధ్రజ్యోతి’ గురువారం వెలుగులోకి తేవడంతో కళ్లు తెరిచిన ట్రస్ట్ అధికారులు... ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకోవాలని నిర్ణయించారు. సీఎంసీవో రిఫరల్ లేఖలు జారీ చేయాలో, లేదో స్పష్టత ఇవ్వాలని కోరుతూ గురువారం మధ్యాహ్నం ఈసీకి లేఖ రాశారు. ఈసీ వెంటనే స్పందించి, లేఖల జారీకి అనుమతిస్తే పేద రోగులకు ఇబ్బందులు తప్పుతాయి.