AP News: పారిశ్రామిక పరంగా ఆంధ్రప్రదేశ్ వెనుకంజలో ఉంది
ABN , Publish Date - Mar 06 , 2024 | 10:16 PM
పారిశ్రామిక పరంగా ఆంధ్రప్రదేశ్ వెనుకంజలో ఉందని, రాష్ట్రంలో సవాళ్లు ఎన్నో ఉన్నాయని సీఐఐ ఏపీ చాప్టర్ ఛైర్మన్ మురళీకృష్ణ వ్యాఖ్యానించారు. మన రాష్ట్రంలోని యువతకు సరైన రీతిలో శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉందని సూచించారు.

పారిశ్రామిక పరంగా ఆంధ్రప్రదేశ్ వెనుకంజలో ఉందని, రాష్ట్రంలో సవాళ్లు ఎన్నో ఉన్నాయని సీఐఐ ఏపీ చాప్టర్ ఛైర్మన్ మురళీకృష్ణ వ్యాఖ్యానించారు. మన రాష్ట్రంలోని యువతకు సరైన రీతిలో శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉందని సూచించారు. పాలసీ అడ్వకసీ ద్వారా ప్రభుత్వానికి కొన్ని సిఫార్సులు చేయాలని భావిస్తున్నామని.. పరిశ్రమల ప్రోత్సాహకానికి ఉపయోగపడేలా తమ సిఫార్సులు ఉంటాయని అన్నారు. ప్రభుత్వాల నుంచి పరిశ్రమలు ఏం ఆశిస్తున్నాయన్న అంశాలపై నివేదిక ఇస్తామన్నారు. పొరుగు రాష్ట్రాలతో సమానంగా ఏపీ ఎదిగేందుకు మరిన్ని చర్యలు అవసరమని పేర్కొన్నారు. పరిశ్రమలకు సంబంధించిన అంశాలను మేనిఫెస్టోలో పెట్టేలా.. అన్ని రాజకీయ పార్టీలకు ఓ నివేదిక ఇవ్వాలని అనుకుంటున్నామని చెప్పారు.