Share News

చింతలపూడి ఎత్తిపోతలకు మళ్లీ జీవం

ABN , Publish Date - Oct 27 , 2024 | 01:00 AM

మెట్ట ప్రాంతానికి ఆయువు పట్టయిన చింతలపూడి ఎత్తిపోత లను జగన్‌ ప్రభుత్వం పాడుపెట్టింది. ఎక్కడికక్కడ పెండింగ్‌ బిల్లులు తడిసి మోపెడ య్యాయి. గత ఐదేళ్ల పాటు పనులు జరిగితే మెట్ట ప్రాంతానికి సాగు, తాగు నీరు అందేది. ఇప్పుడు కూటమి ప్రభు త్వం ఈ ఎత్తిపోతలపై దృష్టి పెట్టింది. వచ్చే ఏడాదికి తొలిదశ పూర్తి చేయాలన్న పట్టుదలతో ఉంది

చింతలపూడి ఎత్తిపోతలకు మళ్లీ జీవం
చింతలపూడి మండలంలో మధ్యలో ఆగిన కాల్వ పనులు

2026 నాటికి తొలిదశ పూర్తికి సంకల్పం

కూటమి ప్రభుత్వం దృష్టి సారింపు

జల వనరుల శాఖ కొత్త కార్యాచరణ

ఈ ఆర్థిక సంవత్సరంలోనే కొన్ని నిధులకు ప్రతిపాదన

ఉమ్మడి పశ్చిమ–కృష్ణా మెట్టకు గోదావరి జలాలు

(ఏలూరు–ఆంధ్రజ్యోతి ప్రతినిధి) :

మెట్ట ప్రాంతానికి ఆయువు పట్టయిన చింతలపూడి ఎత్తిపోత లను జగన్‌ ప్రభుత్వం పాడుపెట్టింది. ఎక్కడికక్కడ పెండింగ్‌ బిల్లులు తడిసి మోపెడ య్యాయి. గత ఐదేళ్ల పాటు పనులు జరిగితే మెట్ట ప్రాంతానికి సాగు, తాగు నీరు అందేది. ఇప్పుడు కూటమి ప్రభు త్వం ఈ ఎత్తిపోతలపై దృష్టి పెట్టింది. వచ్చే ఏడాదికి తొలిదశ పూర్తి చేయాలన్న పట్టుదలతో ఉంది

మెట్టకు ప్రాంతానికి ఇచ్చిన మాట ప్రకారం 2017లోనే చింతలపూడి ఎత్తిపోతల పథకం కింద 2 లక్షల 80 వేలు ఎకరాలు అదనంగా స్థిరీ కరించాలని అప్పటి టీడీపీ ప్రభుత్వం రంగం లోకి దిగింది. తదనుగుణంగానే అంచనా వ్యయా న్ని సవరించింది. తొలుత మెట్టకు తాగు, సాగు నీరు అందించే చింతలపూడి ఎత్తిపోతల పథకా న్ని కొంత వరకు మాత్రమే నిర్మించేందుకు వీలు గా దానికి సరిపడా భూసేకరణ పూర్తి చేశారు. అనేకచోట్ల రైతులు తమకు అదనపు నష్టపరిహా రం కావాలంటూ న్యాయస్థానాలను ఆశ్రయించా రు. ఎత్తిపోతల కింద రెండుచోట్ల జలాశయాలు నిర్మించాలని అప్పట్లో డిజైన్‌ చేశారు. తిరిగి దానిని మార్పులు, చేర్పులు చేసి ఉమ్మడి కృష్ణాలోని మెట్ట ప్రాంతానికి కూడా గోదావరి జలాలను అందించేందుకు వీలుగా దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయల వ్యయంతో కొత్త ప్రణాళిక రచించారు. ఇదంతా మూడు, నాలుగేళ్ల వ్యవధిలోనే పూర్తయ్యేలా రచించారు. ఈ ప్రతి పాదన వచ్చిన తొలి ఏడాది అప్పటి టీడీపీ ప్రభుత్వం 2018–19 బడ్జెట్‌లో కొంత మొత్తం నిధులను కేటాయించింది. దీనిలో భాగంగానే తాళ్ళపూడి వద్ద చింతలపూడి ఎత్తిపోతల హెడ్‌ వర్క్స్‌కు అనుమతులు ఇచ్చింది. గోదావరి నీటిని ఎత్తిపోసి కాల్వలోకి చేర్చేందుకు పనులకు శ్రీకారం చుట్టింది.

నీరుగార్చిన వైసీపీ ప్రభుత్వం

2019లో అధికార పగ్గాలు చేపట్టిన వైసీపీ గత టీడీపీ ప్రభుత్వం చేపట్టిన పథకాల న్నింటిపైనా కక్ష సాధింపునకు దిగింది. 2020–21 బడ్జెట్‌లోను చింతలపూడి ఎత్తిపోతల ఊసే లేకుండా చేశారు. టీడీపీ హయాంలో అంచనా వ్యయాన్ని పెంచి సాగు, తాగునీరు అందించేందుకు దాదాపు 250కు పైగా గ్రామాలకు మరో రెండున్నర లక్షల ఎకరాలకు నీరు అందించేందుకు నిర్దేశించిన ఈ పథకాన్ని వైసీపీ ప్రభు త్వం నీరుగార్చింది. హెడ్‌వర్క్స్‌ పనులు గాలి కొదిలేసింది. కనీసం మోటార్లు బిగించి దానికి మోక్షం కల్పింస్తుందని ఆశించినా అదీ చేయలేదు. బుట్టాయిగూడెం, జీలుగుమిల్లి పరిధిలో జలాశయాల నిర్మాణ పనులపై సమీ క్షించలేదు. అప్పటి జల వనరుల శాఖ మంత్రు లుగా పనిచేసిన అనిల్‌ కుమార్‌, అంబటి రాం బాబు తాము పోలవరం ప్రాజెక్టుకు మాత్రమే మంత్రులం తప్ప ఈ ఎత్తిపోతల తమకు పట్టనట్టుగా వ్యవహరించారు. తాడిపూడి, చింతలపూడి పరిధిలో నిర్వహణ పనుల్లోను ఇదే నిర్లక్ష్యం వహించారు.

పెండింగ్‌.. తడిసి మోపెడు

వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఒకవైపు భూసేకరణ పూర్తిగా నిలిచి పోగా, కాల్వలు, జలాశయాల పనులు పడకేశాయి. చింతలపూడి సమీపం వరకు సాగిన ఎత్తిపోతల కాల్వ ఆవలివైపు ఉన్న కృష్ణా జిల్లా వైపు అంగుళం ముందుకు సాగలేదు. అసలు ఈ పథకం పూర్తవుతుం దో, లేదోనన్న సందేహాలు మూడేళ్లుగా రైతులను వేధిస్తూనే ఉన్నాయి. చింతలపూడి ఎత్తిపోతల పథకం కింద సరా సరిన రూ.75 కోట్లకు పైగా పెండింగ్‌ బిల్లులు చెల్లించలేదు. ఈ నిధులన్నీ మంజూరు చేస్తేనే తప్ప మిగతా పనులవైపు దృష్టి పెట్టలేమని కాం ట్రాక్టు ఏజెన్సీలు తెలిపినా అప్పటి సర్కారుకు పట్టలేదు. కాని కూటమి ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి పెట్టింది. జలవనరుల శాఖ మంత్రి రామానాయుడు నేతృత్వంలో ఇప్పు డు పనులన్నీ ఒక గాడిన పడబోతున్నాయి. సీఎం చంద్రబాబు ప్రాజెక్టులు, ఎత్తిపోతల పను లు పెండింగ్‌, ముందుకు సాగేందుకు తీసుకోవా ల్సిన చర్యలు, కావాల్సిన నిధుల పైనా కొద్దిరోజు ల క్రితమే ఆరా తీశారు. దీంతో ఈ ఆర్థిక సంవ త్సరంలో పెండింగ్‌లోని రూ.75 కోట్ల బిల్లులను త్వరలో క్లియర్‌ చేసేందుకు మార్గం ఏర్పడింది.

పనులను రెండుగా విభజించి..

చింతలపూడి ఎత్తిపోతల పథకం వ్యయాన్ని దృష్టిలో పెట్టుకుని రెండుగా విభజించి సాధ్య మైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని ప్రతిపాదించినట్టు సమాచారం. ఎత్తిపోతల కింద రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అం దించడం, గ్రామాలకు తాగునీరు అందించే దిశగా ముందుకు సాగాలని నిర్ణయించింది. ఇప్పటికే అంచనా వ్యయం కాస్తా తడిసిమోపె డయ్యింది. ఇంతకుముందు సవరించిన అంచ నా వ్యయం రూ.4,900 కోట్లు కాగా ఇప్పుడది భారీగా పెరిగింది. 2024–25 ఆర్థిక సంవత్సరం లో పనులను కొంతలో కొంత పరుగులు తీయించాలంటే కనీసం రూ.300 కోట్లకు పైగా నిధులు అవసరమని జల వనరుల శాఖ ఇప్ప టికే ప్రతిపాదించింది. పోలవరం కుడికాల్వ నిర్మాణంలో రైతులను ఎలా ఒప్పించి పనులు పూర్తి చేశారో అదే క్రమంలో చింతలపూడి ఎత్తి పోతల భూసేకరణలోను ఎదురైన ఆటంకాలను అధిగమించాలన్న తలంపుతో ఉన్నారు. ప్రతీ విషయాన్ని కూటమి ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంటుండడంతో చింతలపూడి ఎత్తిపోత లకు కొంతలో కొంత మోక్షం వచ్చేందుకు మార్గం సుగమమైంది.

Updated Date - Oct 27 , 2024 | 01:00 AM