Share News

Hero Chiranjeevi: పవన్‌ను గెలిపించండి

ABN , Publish Date - May 08 , 2024 | 06:25 AM

టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి రోజురోజుకూ ఊహించని మద్దతు దక్కుతోంది. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణాన.. కూటమికి ముఖ్యంగా పవన్‌ కల్యాణ్‌కు ఆయన పెద్దన్నయ్య, సినీ హీరో చిరంజీవి సహా ఒకే రోజు ఐదుగురు హీరోలు మద్దతు ప్రకటించారు.

Hero Chiranjeevi: పవన్‌ను గెలిపించండి

పిఠాపురం ప్రజలకు చిరంజీవి విన్నపం

తమ్ముడి గెలుపు కోసం వీడియో సందేశం

పవన్‌కు ఒకేరోజు ఐదుగురు హీరోల మద్దతు

అమరావతి, మే 7 (ఆంధ్రజ్యోతి): టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి రోజురోజుకూ ఊహించని మద్దతు దక్కుతోంది. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణాన.. కూటమికి ముఖ్యంగా పవన్‌ కల్యాణ్‌కు ఆయన పెద్దన్నయ్య, సినీ హీరో చిరంజీవి సహా ఒకే రోజు ఐదుగురు హీరోలు మద్దతు ప్రకటించారు.

పిఠాపురం నుంచి ఎమ్మేల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న పవన్‌ను గెలిపించాలని కోరుతూ.. మెగాస్టార్‌ చిరంజీవి ఒక వీడియో విడుదల చేయగా.. ఆయన కుమారుడు రామ్‌చరణ్‌, హీరోలు నాని, రాజ్‌ తరుణ్‌, తేజ సజ్జా కూడా సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టడం జనసైనికుల్లో జోష్‌ నింపింది.

ఇలాంటి నేత కదా కావాల్సింది..

నమ్మిన సిద్ధాంతం కోసం తన జీవితాన్ని రాజకీయాలకు అంకితం చేసిన శక్తిశాలి పవన్‌ కల్యాణ్‌ అని, ఈ ఎన్నికల్లో ఆయనను గెలిపించాలని చిరంజీవి పిఠాపురం ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ ఎన్నికల్లో తన తమ్ముడు పవన్‌ కల్యాణ్‌ విజయాన్ని కోరుతూ మంగళవారం ఆయన ఒక వీడియోను విడుదల చేశారు.

‘‘పవన్‌ కల్యాణ్‌.. అమ్మ కడుపున ఆఖరివాడిగా పుట్టినప్పటికీ... అందరికీ మంచి చేయాలి, మేలు జరగాలనే విషయంలో ముందుంటాడు. తన గురించి కంటే జనం గురించి ఎక్కువగా ఆలోచించే మనస్తత్వం నా తమ్ముడు కల్యాణ్‌ బాబుది. ఎవరైనా అధికారంలోకి వచ్చాక ప్రజలకి ఏదైనా చేయాలనుకుంటారు. కానీ, కల్యాణ్‌ తన సొంత సంపాదనని కౌలు రైతులకు కన్నీళ్లు తుడిచేందుకు ఖర్చు పెట్టడం.. సరిహద్దు దగ్గర ప్రాణాలొడ్డి పోరాడే జవానులో కోసం అందించడం, మత్సకారులతో పాటు ఎంతో మందికి సాయం చేయడం.. చూస్తుంటే ఇలాంటి నాయకుడు కదా జనాలకి కావాల్సింది అనిపిస్తుంది.

ఒకరకంగా చెప్పాలంటే సినిమాల్లోకి తను బలవంతంగానే వచ్చాడు. రాజకీయాల్లోకి మాత్రం ఇష్టంతోనే వచ్చాడు.’’ అంటూ చిరంజీవి వ్యాఖ్యానించారు. చిరంజీవి ఈ వీడియో పెట్టిన వెంటనే ఆయన కుమారుడు రామ్‌చరణ్‌ దాన్ని ఎక్స్‌లో పోస్ట్‌ చేసి.. రాజకీయాల గురించి మాట్లాడడం అలవాటు లేని హీరో నాని కూడా పవన్‌ కల్యాణ్‌కు మద్దతుగా ఓ వీడియో విడుదల చేశారు.

మీరు రాజకీయ కురుక్షేత్రంలో పెద్ద యుద్ధాన్నే ఎదుర్కొనబోతున్నారు’ అని ఎక్స్‌లో పేర్కొన్నారు. యువ కథానాయకుడు రాజ్‌ తరుణ్‌ కూడా పవన్‌కు మద్దతు పలికారు.‘హను-మాన్‌’ హీరో తేజ సజ్జా కూడా పవన్‌కు మద్దతు పలికారు.

పవన్‌ కోసం మెగా హీరోలు వైష్ణవ్‌ తేజ్‌, సాయి దుర్గ తేజ్‌, వరుణ్‌ తేజ్‌ కూడా పిఠాపురంలో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎండల్ని కూడా లెక్క చేయకుండా వీధి వీధి తిరుగుతూ పవన్‌ గెలుపు కోసం కృషి చేస్తున్నారు.

Updated Date - May 08 , 2024 | 06:25 AM