Share News

బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం

ABN , Publish Date - Apr 14 , 2024 | 12:26 AM

బాల్యవివాహాలు చేయడం చట్టరీత్యా నేరమని ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ సౌభాగ్యలక్ష్మి, ఎస్‌ఐ రమేష్‌బాబు తెలిపారు.

బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం

మద్దికెర, ఏప్రిల్‌ 13: బాల్యవివాహాలు చేయడం చట్టరీత్యా నేరమని ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ సౌభాగ్యలక్ష్మి, ఎస్‌ఐ రమేష్‌బాబు తెలిపారు. శనివారం మండలంలోని హంపా గ్రామంలో బాల్య వివాహాలు చేస్తున్నట్లు సమాచారం రావడంతో ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ సౌభాగ్యలక్ష్మి, సిబ్బంది గ్రామానికి వెళ్లి బాల్యవివాహాన్ని నిలిపివేశారు. స్టేషన్‌కు పిలిపించి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. అనంతరం బాల్యవివాహాలు చేస్తే కేసు నమోదు చేస్తామని నోటీసులు ఇచ్చారు. బాల్య వివాహాలు చేస్తున్నట్లు తెలిస్తే.. తమ దృష్టికి తేవాలని, వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని పేర్కొన్నారు. ఏఎస్‌ఐ ఫణిరాజు, అంగన్‌వాడీ టీచర్లు పద్మజ, సంజమ్మ, పోలీసులు, ఉపసర్పంచు తిమ్మప్ప, తదితరులు ఉన్నారు.

Updated Date - Apr 14 , 2024 | 12:26 AM