Share News

హైకోర్టు లాయర్ల సంఘం అధ్యక్షుడిగా చిదంబరం

ABN , Publish Date - May 01 , 2024 | 04:21 AM

హైకోర్టు న్యాయవాదుల సంఘం నూతన అధ్యక్షుడిగా సీనియర్‌ న్యాయవాది కె.చిదంబరం ఎన్నికయ్యారు. చిదంబరానికి మొత్తం 715 ఓట్లు పోలయ్యాయి.

హైకోర్టు లాయర్ల సంఘం అధ్యక్షుడిగా చిదంబరం

అమరావతి, ఏప్రిల్‌ 30(ఆంధ్రజ్యోతి): హైకోర్టు న్యాయవాదుల సంఘం నూతన అధ్యక్షుడిగా సీనియర్‌ న్యాయవాది కె.చిదంబరం ఎన్నికయ్యారు. చిదంబరానికి మొత్తం 715 ఓట్లు పోలయ్యాయి. అధ్యక్ష బరిలో ఉన్న వి.వేణుగోపాలరావుకు 507 ఓట్లు, సి.రఘుకు 501ఓట్లు వచ్చాయి. ఉపాధ్యక్షుడిగా ఎన్‌.రంగారెడ్డి విజయం సాధించారు. రంగారెడ్డికి 655 ఓట్లు రాగా, సమీప అభ్యర్ధి కేఎం కృష్ణారెడ్డికి 607 ఓట్లు వచ్చాయి. 781 ఓట్లతో ప్రధాన కార్యదర్శిగా ఎన్‌.శ్రీహరి గెలుపొందారు. శ్రీహరికి 781 ఓట్లు రాగా, సమీప అభ్యర్ధి టి.సింగయ్యగౌడ్‌కు 438 ఓట్లు వచ్చాయి. సంయుక్త కార్యదర్శిగా ఉదయ్‌కుమార్‌ గెలిచారు. గ్రంథాలయ కార్యదర్శిగా కె.రమ్యకృష్ణ, కోశాధికారిగా జంపని శ్రీదేవి గెలిచారు. క్రీడలు, సాంస్కృతిక కార్యదర్శిగా షేక్‌ రిజ్వాన్‌ అలీ గెలుపొందారు. మహిళా ప్రతినిధిగా వేముల బేబీ రాణి ఏకగ్రీవమయ్యారు. కార్యనిర్వహణ సభ్యులు (30 సంవత్సరాలు)గా కె.మోహన్‌రామిరెడ్డి, బాలినేని పరమేశ్వరరావు(ఇరవై సంవత్సరాలు), ఎగ్జిక్యూటివ్‌ మహిళ సభ్యులు(పది సంవత్సరాలు)గా వరపుల శేషకుమారి ఏకగ్రీవమయ్యారు.

Updated Date - May 01 , 2024 | 07:51 AM