Share News

చెరపకురా... చెడేవు

ABN , Publish Date - Jun 10 , 2024 | 03:42 AM

టీడీపీ కష్టకాలంలో ఉన్నపుడు చంద్రబాబునాయుడు అనాడు కోవర్ట్‌ నాని (కేశినేని శ్రీనివా్‌స)ని పిలిచి లోక్‌సభలో విప్‌ పదవి ఇస్తానంటే వద్దన్నాడని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బుద్దా వెంకన్న తెలిపారు.

చెరపకురా... చెడేవు

కోవర్ట్‌ నాని ఇప్పుడైనా అర్థమైందా?: బుద్దా

విజయవాడ(వన్‌టౌన్‌), జూన్‌ 9: టీడీపీ కష్టకాలంలో ఉన్నపుడు చంద్రబాబునాయుడు అనాడు కోవర్ట్‌ నాని (కేశినేని శ్రీనివా్‌స)ని పిలిచి లోక్‌సభలో విప్‌ పదవి ఇస్తానంటే వద్దన్నాడని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బుద్దా వెంకన్న తెలిపారు. చెరపకురా చెడేవు అన్న సూక్తిని అతను అర్ధం చేసుకుంటాడని గత సంఘటనను వెంకన్న గుర్తు చేస్తూ ఆదివారం ట్వీట్‌ చేశారు. లోక్‌సభలో పార్టీ విప్‌ పదవి ఇస్తానని చంద్రబాబునాయుడు అంటే నాని తిరస్కరించి అంత పెద్ద పదవి తాను చేయలేనని చెప్పాడన్నారు. నానిది రతన్‌ టాటా రేంజ్‌ అని తెలిసి, వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమే గనుక అతన్ని పక్కన పెట్టి అతని తమ్ముడు కేశినేని చిన్నికి అవకాశం ఇచ్చి ఎంపీగా గెలిపించారని బుద్దా వెంకన్న తెలిపారు. పక్కనున్న గుంటూరు నుంచి ఎంపీగా ఎన్నికయిన పెమ్మసానిని కేంద్ర మంత్రివర్గంలోకి పంపారని.. దీనిని బట్టి చెరపకురా చెడేవు అన్నది గుర్తుంచుకోవాలని హితవు పలికారు.

Updated Date - Jun 10 , 2024 | 03:42 AM