Share News

ప్రజలు కోరుకుంటున్న మార్పు తథ్యం

ABN , Publish Date - Apr 06 , 2024 | 03:11 AM

రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్యా ప్రతి ఒక్కరూ మార్పును ఆకాంక్షిస్తున్నారని మే 13న జరుగనున్న ఎన్నికల్లో కచ్చితంగా ఆ మార్పు కనిపిస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమహేంద్రవరం పార్లమెంట్‌ కూటమి అభ్యర్థి దగ్గుపాటి పురందేశ్వరి అన్నారు.

ప్రజలు కోరుకుంటున్న మార్పు తథ్యం

బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి

ద్వారకాతిరుమల, ఏప్రిల్‌ 5: రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్యా ప్రతి ఒక్కరూ మార్పును ఆకాంక్షిస్తున్నారని మే 13న జరుగనున్న ఎన్నికల్లో కచ్చితంగా ఆ మార్పు కనిపిస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమహేంద్రవరం పార్లమెంట్‌ కూటమి అభ్యర్థి దగ్గుపాటి పురందేశ్వరి అన్నారు. ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని శుక్రవారం ఆమె కుటుంబసమేతంగా దర్శించుకుని ప్రత్యేకపూజలు చేశారు. అనంతరం పండితుల నుంచి వేదాశీర్వచనం, స్వామివారి శేషవస్త్రం, ప్రసాదాలు స్వీకరించారు. తర్వాత ఆమె స్థానిక వైష్ణవి హోటల్‌ వద్ద విలేకర్లతో మాట్లాడారు. దేవదాయశాఖ ఉద్యోగులను ప్రభుత్వం ఎన్నికల విధులకు వినియోగించాలని చూస్తోందన్నారు. ఇది సరికాదన్నారు. కాగా, వైసీపీ పతనం ఖాయమని, దీనికి 37 రోజులు మాత్రమే సమయం ఉందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ ఎన్నికల ఇన్‌చార్జ్‌ అరుణ్‌సింగ్‌ మదనపల్లెలో అన్నారు. దేశ, రాష్ట్ర ప్రజలకు.. కులమతాలు, రాజకీయ పార్టీలు, వర్గాలు, ప్రాంతాలకతీతంగా ఉచిత రేషన్‌ పంపిణీ, అందరికీ ఇళ్లు, అనేక సంక్షేమ పథకాలను అందించిన ఘనత మోదీ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ఆయన దృష్టంతా ఆంధ్రప్రదేశ్‌పైనే ఉందని, ఇక్కడ జరుగుతున్న దోపిడీలు, దౌర్జన్యాలు, అక్రమాలు, బడుగు, బలహీన వర్గాలపై జరుగుతున్న అన్యాయాలు, భూఆక్రమణలు, ఇసుక మాఫియాల భరతం పట్టడం ఖాయమన్నారు. అందుకే రాజంపేట పార్లమెంట్‌ అభ్యర్థి, మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డిని పార్లమెంట్‌కు పంపించాలని కోరారు.

Updated Date - Apr 06 , 2024 | 03:11 AM