Share News

శ్రీవారిని దర్శించుకున్న చంద్రబాబు

ABN , Publish Date - May 12 , 2024 | 04:00 AM

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు శనివారం రాత్రి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

శ్రీవారిని దర్శించుకున్న చంద్రబాబు

తిరుమల, అమరావతి, మే 11(ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు శనివారం రాత్రి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. చిత్తూరులో ఎన్నికల ప్రచారాన్ని ముగించుకుని రాత్రి 7.40గంటలకు తిరుమల చేరుకున్న చంద్రబాబు సంప్రదాయ వస్త్ర, తిలకఽధారణతో వైకుంఠం కాంప్లెక్స్‌ క్యూలైన్‌ ద్వారా ఆలయంలోకి వెళ్లారు. మహాద్వారం నుంచి ఆలయంలోకి వెళ్లి ధ్వజస్తంభాన్ని తాకుతూ గర్భాలయంలోకి వెళ్లి మూలమూర్తిని దర్శించుకున్నారు. హుండీలో కానుకలు సమర్పించారు. కాగా, ప్రధాని మోదీ 14న వారాణసీలో నామినేషన్‌ వేయనున్నారు. బీజేపీ జాతీయ నాయకత్వం ఆహ్వానం మేరకు వారాణసికి చంద్రబాబు వెళ్తున్నారని టీడీపీ వర్గాలు తెలిపాయి. అక్కడే ఎన్డీయే కూటమి సమావేశం జరగనున్నది. దీనికి కూడా చంద్రబాబు హాజరుకానున్నారు.

Updated Date - May 12 , 2024 | 07:36 AM