Share News

Chandrababu: చీమకుర్తి గ్రానైట్ దోచుకుంటున్నారంటూ జగన్‌పై ఆరోపణలు

ABN , Publish Date - Jan 05 , 2024 | 06:45 PM

కనిగిరి బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మాట్లాడుతూ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు.

Chandrababu: చీమకుర్తి గ్రానైట్ దోచుకుంటున్నారంటూ జగన్‌పై ఆరోపణలు

ప్రకాశం: కనిగిరి బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మాట్లాడుతూ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు.

"నేను సైకో కి భయపడను. సైకో పోవాలి.... సైకిల్ రావాలి. పులివెందుల నుంచి వచ్చి చీమకుర్తి గ్రానైట్ దోచుకుంటున్నారు. కనిగిరి ప్రాంత ప్రజలు పేదరికంలో ఉన్నా....ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళి స్థిరపడుతున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత కనిగిరి రూపురేఖలు మారుస్తా. అభివృద్ధి, సంక్షేమం టీడీపీ నినాదం. దేశంలో మొదటి సారి రెండు రూపాయలకే ఎన్టీఆర్ బియ్యం ఇచ్చారు. ప్రజలకి 10 రూపాయలు ఇచ్చి 100 దోచుకుంటున్నారు. జగన్ ప్రభుత్వానికి సంపద సృష్టించడం తెలియదు. ఉద్యోగాలు ఇవ్వడం తెలియదు. జాతీయ స్థాయిలో జరిగిన సర్వేలో నిరుద్యోగంలో ఏపీ మొదటి స్థానంలో ఉంది. 2019లో ఒక్క ఛాన్స్ ఇచ్చారు. ఇప్పుడు మోసపోయామని చెబుతున్నారు. ఎన్నికల సమయంలో ముద్దులు పెట్టి ఇప్పుడు పిడి గుద్దులు గుద్దుతున్నారు. " అని చంద్రబాబు విమర్శించారు.

"రాష్ట్రాన్ని సైకో చేతిలో పెడితే ఐదేళ్ళలో ఐదు కోట్ల మంది బాధితులు అయ్యారు. టీడీపీ ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇస్తే....జగన్ గంజాయి ఇస్తున్నాడు. జగన్ ప్రభుత్వంలో వీరబాదుడు. దేశంలో పెట్రోల్, డీజిల్, విద్యుత్ ఛార్జీలు ఏపీలో ఎక్కువ. జగన్ దోపిడీ వలన విద్యుత్ బిల్లులు పెరిగాయి. చెత్త నుంచి సంపద సృష్టించాలని మేం ప్రయత్నించాం. చెత్త మీద పన్ను వేసిన చెత్త ముఖ్యమంత్రి జగన్. రాష్ట్రాన్ని 30 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళాడు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా కుంభకోణాలు జరుగుతున్నాయి. టీడీపీ ప్రభుత్వంలో ఇసుక ఉచితంగా ఇస్తే జగన్ ట్రాక్టర్ ఇసుకకి రూ. 5000 వేలు వసూలు చేస్తున్నాడు. జగన్ నాసిరకం మద్యం అమ్మి పేదల రక్తం తాగుతున్నాడు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత నాణ్యమైన మద్యం నాణ్యమైన ధరకి ఇస్తాం." అని చంద్రబాబు అన్నారు.

Updated Date - Jan 05 , 2024 | 06:46 PM