Share News

Chandrababu : టీడీపీ ఆఫీసులో సందడి

ABN , Publish Date - Jun 04 , 2024 | 03:42 AM

టీడీపీ అధినేత చంద్రబాబు సోమవారం మంగళగిరిలోని ఎన్టీఆర్‌ భవన్‌కు వచ్చారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు అంటూ పెద్దఎత్తున శ్రేణులు నినాదాలు చేశారు.

Chandrababu : టీడీపీ ఆఫీసులో సందడి

హోరెత్తిన సీఎం, సీఎం నినాదాలు

టీడీపీ అధినేత చంద్రబాబు సోమవారం మంగళగిరిలోని ఎన్టీఆర్‌ భవన్‌కు వచ్చారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు అంటూ పెద్దఎత్తున శ్రేణులు నినాదాలు చేశారు. కార్యకర్తల ఉత్సాహం చూసిన చంద్రబాబు శక్తిని అప్పుడే ఖర్చు చేసుకోవద్దని శ్రేణులతో చమత్కరించారు. కౌంటింగ్‌కు సంబంధించి మానిటరింగ్‌ ఏర్పాట్లు పరిశీలించారు. ఆఫీస్‌లో ఉండి పనిచేసిన నేతలను చంద్రబాబు అభినందించారు. ఎన్నికల్లో తన పర్యటనలు కో-ఆర్డినేట్‌ చేసిన సభ్యులను అభినందించారు. పెందుర్తి వెంకటేశ్‌, పరుచూరి కృష్ణ, బండారు హనుమంతరావు, గంటా గౌతమ్‌, రవియాదవ్‌, రాజశేఖర్‌, శ్రీనివా్‌సలు చంద్రబాబు ఎన్నికల ప్రచారాన్ని సమన్వయం చేశారు.

Updated Date - Jun 04 , 2024 | 03:42 AM