ఏపీ జెన్కో, నెడ్‌క్యాప్‌లకు ఐఎస్‌వో గుర్తింపు
ABN , Publish Date - Oct 27 , 2024 | 03:35 AM
ఏపీ జెన్కో, నెడ్‌క్యాప్‌లకు ఐఎస్‌వో 9001:2015 గుర్తింపు రావడంపై సీఎం చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు.
అమరావతి, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): ఏపీ జెన్కో, నెడ్‌క్యాప్‌లకు ఐఎస్‌వో 9001:2015 గుర్తింపు రావడంపై సీఎం చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు. ఏపీజెన్కో ఎండీ కేవీఎన్ చక్రధరబాబును అభినందించారు. పునరుత్పాదక ఇంధన వనరులపై సీఎం సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఏపీజెన్కో, నెడ్‌క్యాప్‌లకు ఐఎస్‌వో గుర్తింపు అంశం చర్చకు వచ్చింది.